నిస్సాన్-అశోక్ లేల్యాండ్‌లను లైట్ వెయిట్ ట్రక్స్..!

Nissam-Ashok L,eyland
వాణిజ్య వాహనాల తయారీలో భారత రెండవ అతిపెద్ద కంపెనీ అయిన అశోక్ లైలాండ్, జపాన్‌కు చెందిన నిస్సాన్ కంపెనీలు సంయుక్తంగా రూపొందించిన చిన్న తరహా వాణిజ్య వాహనాలు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు అశోక్ లైలాండ్ కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో లైట్ కమర్షియల్ ట్రక్కులను విడుదల చేయనున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మొత్తం మూడు వాణిజ్య వాహనాలను విడుదల చేస్తామని, అందులో ఒక లైట్ వ్యాన్, ఒక లైట్ ట్రక్ మరియు ఒక హెవీ ట్రక్‌లు ఉంటాయని, వీటిని రెండు విడలుగా విడుదల చేస్తామని ఆయన వివరించారు.

ఈ ప్రాజెక్టు కోసం ఇరు కంపెనీలు మరో 3-4 ఏళ్ల పాటు రూ. 1,100 కోట్ల నుంచి రూ. 1,200 కోట్ల మేర పెట్టుబడులు వెచ్చించనున్నట్లు సమాచారం. అశోక్ లైలాండ్‌కు హోసూర్‌లో ఉన్న ప్లాంటులో ఏడాదికి లక్ష వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. శ్రీపెరంబూర్‌లో కంపెనీ నిర్మిస్తున్న ప్లాంటు నిర్వహణలోకి వచ్చినట్లయితే ఈ ఉత్పత్తి సామర్థ్యం 1,90,000 యూనిట్లకు పెరగవచ్చునని కంపెనీ భావిస్తోంది. దీని తర్వాత గ్రీన్‌ఫీల్డ్‌లో మరో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. 380 ఎకరాల్లో తలపెట్టిన ఈ ప్లాంటుకు స్థాపన కోసం తమిళనాడు సర్కారు ఆమోదం గురించి వేచిచూస్తున్నామని ఆయన వెల్లడించారు.

More from DriveSpark

Article Published On: Thursday, March 17, 2011, 10:09 [IST]
English summary
The country’s second largest in heavy commercial vehicles manufacturing Ashok Leyland with its ally Nissan is aiming to launch light weight commercial trucks during the second half of this year. This was disclosed by the company’s Vice Chairman adding that there will be three new products – light van, light truck, and a heavy truck in two phases.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+