భారత్‌లో సన్ని సెడాన్ ఉత్పత్తిని ప్రారంభించిన నిస్సాన్

ప్రస్తుతం నిస్సాన్ అందిస్తున్న చిన్న కారు మైక్రాను మాత్రమే కంపెనీకు చెన్నయ్‌లోని ఓరగడంలో ఉన్న ప్లాంటులో ఉత్పత్తి చేస్తుంది. కాగా.. కొత్త సన్ని కారు భారత్‌లో నిస్సాన్ నుంచి లభిస్తున్న రెండవ మేడ్-ఇన్-ఇండియా కారు కావడం విశేషం. నిస్సాన్ 1966లో మొదటిసారిగా సన్ని కారును విడుదల చేసింది.
గడచిన 45 ఏళ్లుగా సన్ని పేరు నిస్సాన్ కంపెనీకు ఓ ఐకానిక్ నేమ్‌గా నిలిచిపోయింది. కాగా.. ప్రస్తుతం మార్కెట్లోకి రానున్న నిస్సాన్ సన్ని సెడాన్ 10వ తరానికి (టెన్త్ జనరేషన్) చెందినది. నిస్సాన్ సన్ని సెడాన్‌ను వీ-(వెర్సిటైల్) ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందిస్తున్నారు.
భారత్‌లో అత్యంత పాపులర్ అయిన నిస్సాన్ చిన్న కారు 'మైక్రా' తయారీలో కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. ఆకర్షనీయమైన ఎక్స్టీరియర్స్ డిజైన్, సరికొత్త లుక్‌తో ఇది మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో ఫోక్స్‌వ్యాగన్ వెంటో, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వగలదని కంపెనీ భావిస్తోంది.
గతేడాది దేశీయ మార్కెట్లో నిస్సాన్ ఇండియా విడుదల చేసిన చిన్న కారు మైక్రాకు దేశీయ మార్కెట్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కాగా.. భారత్‌లో నిస్సాన్‌కు ఇది రెండవ కారు కావడం విశేషం. అయితే, నిస్సాన్ సన్ని సెడాన్ కారు ధర తదితర వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు.


Click it and Unblock the Notifications








