మైక్రాపై భారీ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తున్న నిస్సాన్ డీలర్లు

తగ్గిన అమ్మకాల కారణంగా మరికొందరు డీలర్లు తమ వద్ద పేరుకుపోయిన స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు కూడా వివిధ రకాల ఉచిత పథకాలను ప్రవేశ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో నిస్సాన్ చిన్న కారు మైక్రాపై దాదాపు రూ.42,000/- విలువ కలిగిన ప్రోత్సాహకాలను డీలర్లు ఆఫర్ చేస్తున్నారు.
ఉచితంగా రెండేళ్ల అధనపు వారంటీ, ఉచిత బీమా, ఉచిత యాక్ససరీలు లేదా ఉచితంగా రెండేళ్ల అధనపు వారంటీ, ఉచిత బీమా, మూడేళ్లకు సరిపడా మెయింటినెన్స్ ప్యాకేజీలను డీలర్లు ఆఫర్ చేస్తున్నారు. ఈ రెండింటింలో ఏదైనా ఒక స్కీమ్‌ను కొనుగోలుదారులు ఎన్నుకోవచ్చు.
ఇవి కాకుండా... అధిక వడ్డీ రేట్లతో బాధపడేవారని దృష్టిలో ఉంచుకొని 5.98 శాతం ప్రత్యేక వడ్డీ రేటుకే రుణ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం. మీ సమీప డీలర్ వద్దకు వెళ్లి బుజ్జి మైక్రాతో పాటు ఆకర్షనీమైన ఆఫర్లను సొంతం చేసుకోండి.


Click it and Unblock the Notifications