వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్: నిస్సాన్ లీఫ్ ఎలక్ట్రిక్ కారు

Nissan Leaf
జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్ సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ కారు "లీఫ్" న్యూయార్క్‌లో జరిగిన అంతర్జాతీయ ఆటో షోలో 2011 సంవత్సరానికి గానూ "వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌"గా నిలిచింది. సిబిఎస్ న్యూస్ ప్రకారం.. "వరల్డ్ గ్రీన్ కార్ అవార్డు"కు కూడా లీఫ్ రన్నరప్‌గా ఎన్నికైనట్లు సమాచారం. వరల్డ్ గ్రీన్ కార్ అవార్డును చెవీ వోల్ట్ గెలుచుకుంది.

కాగా.. వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ కోసం గట్టి పోటీ ఇచ్చిన ఆడి ఏ8, బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ మోడళ్లను అధిగమించి లీఫ్‌ అగ్రభాగంలో నిలిచింది. 80 కిలోవాట్ల శక్తితో లీఫ్ గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇందులో ఉపయోగించే బ్యాటరీ 90 కిలోవాట్లకు పైగా సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది పూర్తిగా చార్జ్ కావడానికి 7 గంటల సమయం పడుతుంది.

అంతేకాకుండా ఈ కారుకు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదు. కాగా.. ఈ షోలో ప్రముఖ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఫెరారీ అందిస్తున్న 'ఫెరారీ 458 ఇటాలియా' కారు "వరల్డ్ పెర్ఫామెన్స్ కార్" టైటిల్‌ను, జేమ్స్ బాండ్ కార్లుగా పేరుగాంచిన ఆస్టన్ మార్టిన్ సంస్థ అందిస్తున్న 'ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్' కారు "వరల్డ్ డిజైన్ కార్" టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, May 2, 2011, 17:11 [IST]
English summary
Japanese auto gaint Nissan's electric car 'LEAF' has been named the 2011 World Car of the Year at the New York International Auto Show. Reports says that, it has also named a runner-up for the World Green Car award. The Chevy Volt won the Green award.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+