మైక్రా ధరను రూ. 11,170 మేర పెంచిన నిస్సాన్ మోటార్ ఇండియా

ప్రస్తుతం పెట్రోల్ వెర్షన్ నిస్సాన్ మైక్రా కారు ధర రూ. 4.06 లక్షల నుంచి రూ. 4.36 లక్షల మధ్య ఉండగా.. డీజిల్ వేరియంట్ ధర రూ. 5.59 లక్షల నుంచి 6.05 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంది. కాగా.. కంపెనీ దిగుమతి చేసుకొని భారత్‌లో విక్రయిస్తున్న ఎస్‌యూవీ ఎక్స్-ట్రైల్, లగ్జరీ సెడాన్ టీనా, స్పోర్ట్స్ కారు 370జెడ్ మోడల్ ధరలను మాత్రం యథాతథంగా ఉంచింది.
ఇప్పటికే దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అన్ని మోడళ్లపై రూ. 9,000 మేర పెంచగా, మహీంద్రా అండ్ మహీంద్రా రూ. 15,000 మేర పెంచిన సంగతి తెలిసిందే. అలాగే టాటా మోటార్స్ కూడా ప్యాసింజర్ వాహనాలపై ధరలను రూ. 36,000 మేర పెంచగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ధరల పెంపు విషయాన్ని పరిశీలిస్తోంది.


Click it and Unblock the Notifications








