టొయోటా ఇన్నోవాకు పోటీగా ఎమ్‌యూవీ: నిస్సాన్ మోటార్

Nissan-Toyota
జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్ భారత మార్కెట్లో 2012 నాటికి మరో రెండు కొత్త వాహనాలను ప్రవేశపెట్టునున్నట్లు ప్రకటించింది. ఈ అంశంపై నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కిమినోబు టోకుయమా మాట్లాడుతూ.. ఈ ఏడాది ఓ గ్లోబల్ సెడాన్(ఎకానమీ)ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నామని, టొయోటా ఇన్నోవాకు పోటీగా మరో బహుళ ప్రయోజన వాహన వాహనాన్ని (మల్టీ పర్పస్ వెహికల్‌) 2012లో ప్రవేశపెడతామని చెప్పారు. భారత మార్కెట్లో గ్లోబల్ సెడాన్ ధర రూ. 6-9 లక్షల మధ్య ఉండొచ్చు. ప్రస్తుతం ఈ మోడల్‌ను సన్నీ పేరుతో నిస్సాన్ జపాన్‌లో విక్రయిస్తోంది.

మైక్రాను తయారు చేసిన ఫ్లాట్‌ఫామ్ ఆధారంగానే ఈ సెడాన్‌ను రూపొందిస్తామని, తొలుత దీనిని చైనాలో విడుదల చేస్తామని, భారత్‌ కోసం ఈ సెడాన్ కారును చైనా ప్లాంటులో ఉత్పత్తి చేస్తామని ఆయన చెప్పారు. యూరప్, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా దేశాలకు 1.1 లక్షల మైక్రా కార్లను ఎగమతి చేయగలమని ఆయన అంచనా వేశారు. గత అక్టోబర్ నెలలో మైక్రా ఎగుమతులను ప్రారంభించిన నిస్సాన్ ఇప్పటి వరకూ 55,000 కార్లను ఎగుమతి చేసినట్లు ఆయన వివరించారు.

కాగా.. హైదరాబాద్‌లోని ఎస్‌పీ రోడ్‌లో కంపెనీ కొత్తగా "ఫార్చూన్ నిస్సాన్ షోరూం"ను ప్రారంభించింది. భవిష్యత్తులో చెన్నై ప్లాంటులో తయారయ్యే సెడాన్ కార్లను కూడా ఎగుమతి చేయనున్నామని, అలాగే మరో చిన్న కారును కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని నిస్సాన్ తెలిపింది. పూర్తిగా భారతదేశంలో తయారైన చిన్న కారు నిస్సాన్ మైక్రాను గత జూలైలో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటి వరకూ భారత్‌లో మొత్తం 13,000 మైక్రా కార్లు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం సాలీనా రెండు లక్షల యూనిట్లుగా ఉన్న చెన్నయ్ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని నాలుగు 4 లక్షల యూనిట్లకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Thursday, April 14, 2011, 11:12 [IST]
English summary
Japanese auto major Nissan to launch two new vehicles in India by 2012. A global sedan will be in market this year and another vehicle, which is expected to compete with Toyota's Innova, will be launched in 2012 said, Kiminobu Tokuyama, Nissan Motor India Managing Director and CEO.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+