కస్టమర్ల కోసం ఎస్‌బిఐతో చేతులు కలిపిన నిస్సాన్

Nissan Micra
ప్రముఖ ఆటో దిగ్గజం నిస్సాన్ తమ కస్టమర్లకు సులువుగా రుణసదుపాయాన్ని కల్పించేందుకు భారతదేశపు అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బిఐ)తో చేతులు కలిపింది. ఈ మేరకు ఇరు సంస్థలు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ప్రస్తుత మార్కెట్ రేట్ కన్నా 100 బేసిస్ పాయింట్ల వరకూ తక్కువ వడ్డీ రేట్‌తో నిస్సాన్ కస్టమర్లు ఫైనాన్స్ సదుపాయాన్ని కల్పిస్తామని ఎస్‌బిఐ పర్సనల్ బ్యాంకింగ్ ఛీఫ్ జనరల్ మేనేజర్ ఆర్ఎన్ మెహ్రా ఓ ప్రకటనలో తెలిపారు.

ఇప్పుడు నిస్సాన్ కస్టమర్లు ఎస్‌బిఐ నుండి 11.25 శాతం (ఫ్లోటింగ్), 11.75 శాతం (ఫిక్స్‌డ్) వడ్డీ రేట్లతో రుణాలను పొందవచ్చు. నిస్సాన్ ఇప్పటికే హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ సంస్థలతో బ్యాంకింగ్ ఒప్పందాలను కలిగి ఉందని నిస్సాన్ మోటార్ ఇండియా ప్రై లి ఛీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ సునీల్ రీఖీ తెలిపారు. తమిళనాడులోని ఒరగడం వద్ద ఫ్రెంచ్ ఆటో మేజర్ రీనాల్ట్‌తో కూడా నిస్సాన్ ఓ వాణిజ్య భాగస్వామ్య ఒప్పందాన్ని కలిగి ఉన్న సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Friday, November 18, 2011, 10:44 [IST]
English summary
Japan based carmaker Nissan signed an agreement with India's largest public sector bank State Bank of India (SNI) to provide finance services to their prospective customers across India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+