విదేశీ మార్కెట్ల కోసం మేడ్ ఇన్ ఇండియా మినీ వ్యాన్

వీటిని దాదాపు 55,000 యూనిట్లను మేము ఉత్పత్తి చేయనున్నాం. ఇందులో 20 శాతాన్ని సమీప మార్కెట్లోకి ఎగుమతి చేయాలని భావిస్తున్నామ'ని నిస్సాన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆండీ పాల్‌మర్ వెల్లడించారు. కాగా.. ఇప్పటికే ఈ రెండు సంస్థలు 51:49 జాయింట్ వెంచర్‌గా ఏర్పడి 1.25 టన్నుల పేలోడ్ సామర్థ్యం కలిగిన ఓ చిన్న తరహా వాణిజ్య వాహనం 'దోస్త్'ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ జేవీ ఇటీవలే దోస్త్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది.
అయితే, పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం... నిస్సాన్ ప్రతిపాదించిన మినీ వ్యాన్ ప్రాజెక్ట్‌కు దోస్త్ ఫ్లాట్‌ఫామ్‌నే ఉపయోగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








