ఇన్ఫినిటీ లగ్జరీ కార్లను భారత్‌కు తీసుకురానున్న నిస్సాన్!

Nissan Leaf
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కంపెనీ భారత మార్కెట్లో తమ సూపర్-లగ్జరీ బ్రాండ్ అయిన 'ఇన్ఫినిటీ' కార్లను ప్రవేశపెట్టేందుకు మొగ్గు చూపుతోంది. నిస్సాన్ మోటార్ కంపెనీ (ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ మరియు ఇండియా) ఉపాధ్యక్షుడు గిల్లెస్ నార్మండ్ మాట్లాడుతూ.. ఇన్ఫినిటీ కార్లను భారత మార్కెట్లో సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్స్)గా దిగుమతి చేసుకొని విక్రయించనున్నట్లు తెలిపారు. ఇతర ధనిక దేశాలతో పోలిస్తే భారత లగ్జరీ కార్ మార్కెట్ పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ ఇది ఏడాదికేదాడి రెండితలు పెరగుతూ వస్తుంది.

ప్రస్తుతం భారత నెంబర్ వన్ లగ్జరీ కార్ల కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ గతేడాదితో పోలిస్తే 2010-11లో విక్రయాలను 3,461 యూనిట్ల నుంచి 6,281 యూనిట్లకు పెంచుకుంది. అలాగే.. బిఎమ్‌డబ్ల్యూ తర్వాతి స్థానంలో ఉన్న మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ 3,611 యూనిట్ల నుంచి 5,987 యూనిట్లను విక్రయించగా, ఆడి 2010 సంవత్సరం కన్నా ప్రస్తుత సంవత్సరంలో 50 శాతం ఎక్కువగా 4,500 కార్లను విక్రయించాలని భావిస్తోంది. ఇంకా పార్షే, బెంట్లీ వంటి కంపెనీలు కూడా రెండింతల వృద్ధిని ఆశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత లగ్జరీ కార్ మార్కెట్లో ఉన్న అవకాశాలు చేజిక్కుంచునేందుకు నిస్సాన్ కూడా ఈ విభాగంపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది.

ఇక ఎలక్ట్రిక్ కార్ల విషయానికి వస్తే.. ఇందుకు మూడు మార్కెట్ కండిషన్స్ అవసరమని నార్మంద్ అభిప్రాయపడ్డారు. అందులో మొదటిది.. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలతో నడిచే కార్ల ధర కన్నా ఎలక్ట్రిక్ కార్ల ధరలు తక్కువగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం. రెండోది.. ఇటువంటి ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ కోసం సరైన మౌళిక సదుపాయాల (ఇన్ఫ్రాస్ట్రక్చర్)ను కల్పించడం. ఉదాహరణకు నిస్సాన్ లీఫ్ ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 170 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది, కాబట్టి రోడ్డుపై కనీసం ప్రతి 170 కిలోమీటర్లకైనా ఒక చార్జింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేయడం. మూడోది పర్యావరణానికి హాని కలిగించని ఇలాంటి వాహనాలపై ప్రజలలో ప్రభుత్వం అవగాహన కల్పించడం అవసరమని ఆయన తెలిపారు.

ఇదిలా ఉండగా, ఈ ఏడాదిలో నిస్సాన్ ఓ సెడాన్ కారును భారత్‌కు తీసుకురానుంది. ప్రస్తుతం భారతీయ వినియోగదారులు డీజిల్ కార్లపైనే ఎక్కువ మక్కువ చూపుతుండటంతో వీలైనంత త్వరగా ఈ సెడాన్ కారును భారత్‌కు తీసుకురావాలని కంపెనీ యోచిస్తుంది. సి-సెగ్మెంట్‌లో రానున్న ఈ సెడాన్ కారు స్విఫ్ట్ డిజైర్‌ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే ఆస్కారం ఉంది. కాగా.. గతేడాది భారత మార్కెట్లో విడుదల చేసిన నిస్సాన్ చిన్న కారు మైక్రా ఇప్పటి వరకూ భారత్‌లో 13,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఈ ఏడాదిలో 40,000 మైక్రా కార్లను అమ్మాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ ఇటీవలే చెన్నయ్ ప్లాంటులో మొదటి లక్ష మైక్రా కార్ల ఉత్పత్తిని పూర్తి చేసింది.

More from DriveSpark

Article Published On: Monday, June 20, 2011, 12:10 [IST]
English summary
In Indian market, the Japanese automobile major Nissan Motor Company is surveying for the launch of its ‘Infiniti' range of super-luxury cars. Gilles Normand, Corporate Vice-President — Africa, Middle East and India, Nissan Motor Company said that the Infiniti cars for the Indian market would be “obviously CBUs (completely built units),” imported from elsewhere.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+