ఎక్స్-ట్రైల్‌పై రూ. లక్ష డిస్కౌంట్‌ను అందిస్తున్న నిస్సాన్

మూడు వేరియంట్లలో అమ్మడవుతున్న నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీపై ఈ తగ్గింపు వర్తించనుంది. భారత మార్కెట్లో నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీ ధరలు రూ. 22 లక్షల నుండి 26.5 లక్షల మధ్యలో ఉన్నాయి. ప్రస్తుతం నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీను జపాన్‌ను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్)గా దిగుమతి చేసుకొని దేశీయ మార్కెట్లో విక్రయించడం జరుగుతుంది.
భారత కార్ మార్కెట్లో ఇదే విభాగంలో ఉన్న టొయోటా ఫార్చ్యూనర్, హోండా సిఆర్‌వి, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1, ఫోర్డ్ ఎండీవర్, చెవర్లే కాప్టివా, మిత్సుబిషి క్వాట్‌లాండర్ ఎస్‌యూవీలకు ధీటుగా నిస్సాన్ ఎక్స్-ట్రైల్ నిలువనుంది.


Click it and Unblock the Notifications








