మొదటి లక్ష మైక్రా కార్ల ఉత్పత్తిని పూర్తి చేసిన నిస్సాన్

ఈ ప్లాంటు స్థాపన కోసం కంపెనీ రూ. 4,500 కోట్లను పెట్టుబడులుగా వెచ్చించింది. గత జులైలో భారత మార్కెట్లో ప్రవేశించిన నిస్సాన్ ఇప్పటి వరకూ 15,000కు పైగా కార్లు అమ్ముడయ్యాయి. భారత్‌లోనే కాకుండా థాయ్‌లాండ్, మెక్సికో మరియు చైనా దేశాల్లో కూడా మైక్రా కారును నిస్సాన్ ఉత్పత్తి చేస్తుంది. కాగా.. భారత్‌లో తయారైన మైక్రా కార్లు ఎక్కువ భాగం విదేశాలకే ఎగుమతి అవుతాయి. ఈ ఏడాదిలో నిస్సాన్ ఓ గ్లోబల్ సెడాన్ కారును భారత మార్కెట్‌కు పరిచయం చేయనుంది. అంతేకాకుండా ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్‌తో కూడా జాయింట్ వెంచర్‌గా ఏర్పడి ఓ వాణిజ్య వాహనాన్ని ఉత్పత్తి చేయనుంది.


Click it and Unblock the Notifications








