నిస్సాన్ సన్నీ సెడాన్‌పై రూ.52,000 బంపర్ ఆఫర్

మరోవైపు ఇంకొద్ది రోజుల్లోనే పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం కూడా వస్తుండటంతో వివిధ కార్ల కంపెనీలు అమ్మకాలను పెంచుకునేందుకు, తద్వారా ఇన్వెంటరీని క్లియర్ చేసుకునేందుకు తప్పనిసరై ఉచిత ఆఫర్లను, నగదు డిస్కౌంట్లు వంటి వివిధ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్, తాజాగా మార్కెట్లోకి విడుల చేసిన ఎంట్రీలెవల్ సెడాన్ నిస్సాన్ సన్నీపై బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అసలే తక్కువ ధరకు విడుదలైన ఈ సెడాన్‌పై సుమారు రూ.52,000 విలువైన వివధ ప్రోత్సాహాకాలను డీలర్లు ఆఫర్ చేస్తున్నారు.
నిస్సాన్ సన్నీ సెడాన్‌ను కంపెనీ గడచిన సెప్టెంబర్ నెలలో కేవలం రూ.5.78 లక్షల ధరకే విడుదల చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా కొనుగోలుదారులు రూ.27,000 విలువైన వాహన బీమాను, రూ.25,000 నగదు తగ్గింపును పొందవచ్చు. నిస్సాన్ సన్నీ ప్రస్తుతం పెట్రోల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది.


Click it and Unblock the Notifications








