ఆఫ్రికా, ఆసియా మార్కెట్లకు వెళ్లనున్న నిస్సాన్ సన్నీ

ఈ అవకాశాలను చేజిక్కుంచుకునేందుకు వచ్చే ఏడాది ఆరంభంలో సన్నీ సెడాన్ కారును పశ్చిమ ఆసియా, ఆఫ్రికా మార్కెట్లలో ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. ప్రస్తుతం సన్నీ సెడాన్ కారు చెన్నైలోని ఓరగడం ప్లాంటులో నిస్సాన్ ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్లాంటులో నిస్సాన్ నుంచి మైక్రా తర్వాత ఉత్పత్తి అవుతున్న రెండవ కారు సన్నీ. గతేడాది అక్టోబర్ నెలలో మైక్రా కారు మార్కెట్లోకి విడుదలైంది.
వచ్చే ఏడాదిలో టొయోటా ఇన్నోవా లాంటి ఓ ఎమ్‌పివి (మల్టీ పర్పర్ వాహనం)ను భారత్‌లో విడుదల చేస్తామని ఆయన చెప్పారు. అయితే, ఈ మోడల్‌కు సంబంధించిన ధర, ఇతర వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో లభ్యమవుతున్న నిస్సాన్ ఎన్‌వీ200 ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ కొత్త మోడల్‌ను కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది.
నిస్సాన్ విడుదల చేసిన చిన్న కారు మైక్రాకు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తుండటంతో సెప్టెంబర్ నెలలో కంపెనీ అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. సెప్టెంబర్ 2011లో నిస్సాన్ మోటార్ ఇండియా అమ్మకాలు 73 శాతం పెరిగి 2,176 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో ఇవి 1,256 యూనిట్లుగా ఉన్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.


Click it and Unblock the Notifications








