రూ.5.78 లక్షలకే సన్నీ సెడాన్‌ను ప్రవేశపెట్టిన నిస్సాన్

Nissan Sunny
నిస్సాన్ ఇండియా నేడు భారత మార్కెట్లోకి తమ మిడ్-సైజ్ సెడాన్ "సన్నీ"ను విడుదల చేసింది. మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లోనే అత్యంత పోటీతత్వ ధరతో నిస్సాన్ సన్నీ సెడాన్‌ను ఆవిష్కరించింది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. ప్రారంభ వేరియంట్ (నిస్సాన్ సన్నీఎక్స్ఈ) ధర కేవలం రూ.5.78 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై) మాత్రమే.

ఇకపోతే ఇతర రెండు వేరియంట్లయిన నిస్సాన్ సన్నీ ఎక్స్ఎల్ ధర రూ.6.68 లక్షలు గానూ, నిస్సాన్ సన్నీ ఎక్స్‌వీ ధర రూ.7.68 లక్షలు గానూ కంపెనీ నిర్ణయించింది. ఈ ముడు వేరియంట్లు కూడా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 97 బిహెచ్‌పిల శక్తిని, 134 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తాయి. మైక్రా తయారీలో ఉపయోగించిన వీ-ఫ్లాట్‌ఫామ్‌నే సన్నీ తయారీలోను ఉపయోగించారు.

ఫోర్డ్ ఫియస్టా, హ్యుందాయ వెర్నా ఫ్లూయిడిక్, హోండా సిటీలకు ఈ కొత్త మోడల్ ఇటు ధరలోనూ అటు పెర్ఫామెన్స్‌లోనూ గట్టి పోటీ ఇవ్వనుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన ప్రకారం, ఇది లీటరు పెట్రోల్‌కు 16.95 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. ఈ మూడు వేరియంట్లలోనూ పవర్ స్టీరింగ్, ఎయిర్ కండిషనింగ్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ మరియు ఈబిడితో కూడిన ఏబిఎస్ సిస్టమ్‌లు స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా వస్తాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, September 20, 2011, 16:55 [IST]
English summary
Nissan Motors India, the Japanese carmaker has launched the new Sunny mid level sedan in India at a ceremony in Mumbai. The all important information that was not available until today was the Sunny's price. Nissan has said the Sunny will be available at showrooms with a starting price of Rs.5.78 lakhs for the base XE model. Nissan has revealed that the Sunny will offer a fuel economy 16.95kmpl as per ARAI standards.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+