బెంగుళూరు మార్కెట్లోకి నిస్సాన్ సన్నీ సెడాన్‌ విడుదల

Nissan Sunny
జపాన్ ఆటో దిగ్గజం నిస్సాన్ ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన్న మిడ్-సైజ్ సెడాన్ సన్నీ కారును తాజాగా బెంగుళూరు మార్కెట్లో కూడా కంపెనీ విడుదల చేసింది. ఈ సెగ్మెంట్లోనే అత్యంత ఆకర్షనీమైన ధరతో సన్నీ సెడాన్‌ను అందిస్తున్నామని నిస్సాన్ ఇండియా సీఈఓ దినేష్ జైన్ తెలిపారు. ఈ కారును చెన్నైలోని రీనాల్ట్-నిస్సాన్ ఓరగడం ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు.

ఇటు విలాసానికి అటు సౌకర్యానికి ఏ మాత్రం తీసిపోకుండా వెచ్చించిన మొత్తానికి సరైన విలువ కలిగి ఉండేలా తాము ఈ మోడల్‌ను రూపొందించామని, భారత వినియోగదారుల అవసరాలను తీర్చే ఉత్పత్తులను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. త్వరలోనే ఇందులో డీజిల్ వేరియంట్‌ను కూడా అందిస్తామని, భారత మార్కెట్ కోసం మైక్రా కారుకు దిగువన మరో చిన్న కారును కూడా విడుదల చేస్తామని జైన్ చెప్పారు.

మూడు వేరియంట్లలో లభించే నిస్సాన్ సన్నీ సెడాన్ లీటరు పెట్రోల్‌కు 16.95 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ తెలిపింది. బ్రాంజ్ గ్రే, బ్లేడ్ సిల్వర్, స్ట్రోమ్ వైట్, సప్ప్‌హైర్ బ్లూ, ఓనిక్స్ బ్లాక్, బ్రిక్ రెడ్ అనే ఆరు ఆర్షనీమైన రంగుల్లో కొత్త నిస్సాన్ సన్నీ సెడాన్ లభ్యమవుతుంది. కంపెనీ మొదటి సారిగా సన్నీ సెడాన్ కారును 1966లో విడుదల చేసింది. ఇప్పటి వరకూ 1.6 కోట్లకు పైగా సన్నీ కార్లు విక్రయించింది.

బెంగుళూరులో ఎంట్రీ-లెవల్ వేరియంట్ నిస్సాన్ సన్నీ ఎక్స్ఈ ధర రూ.5,85,707, మిడ్-లెవల్ వేరియంట్ నిస్సాన్ సన్నీ ఎక్స్ఎల్ ధర రూ.6,97,173 మరియు హై-ఎండ్ వేరియంట్ వేరియంట్ నిస్సాన్ సన్నీ ఎక్స్‌వీ ధర రూ.7,78,240 (అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)గా ఉన్నాయి. ప్రస్తతం కంపెనీ విడుదల చేసిన సన్నీ 10వ తరానికి (టెన్త్ జనరేషన్) చెందినది.

ఫోర్డ్ ఫియస్టా, హ్యుందాయ వెర్నా ఫ్లూయిడిక్, హోండా సిటీ వంటి మిడ్-సెజ్ సెడాన్‌లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ మూడు వేరియంట్లలోనూ పవర్ స్టీరింగ్, ఎయిర్ కండిషనింగ్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ మరియు ఈబిడితో కూడిన ఏబిఎస్ సిస్టమ్‌లు స్టాండర్డ్ ఎక్విప్‌మెంట్‌గా వస్తాయి. రానున్న ఐదేళ్లలో మరో ఐదు కొత్త మోడళ్లను విడుదల చేస్తామని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Monday, September 26, 2011, 11:24 [IST]
English summary
Nissan Motors India, the Japanese carmaker has launched the new Sunny mid level sedan in Bengaluru. The all important information that was not available until today was the Sunny's price. Nissan has said the Sunny will be available at showrooms with a starting price of Rs.5.85 lakhs for the base XE model. Nissan has revealed that the Sunny will offer a fuel economy 16.95kmpl as per ARAI standards.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+