నిస్సాన్ ఎమ్‌యూవీ: జనవరిలో ఆవిష్కరణ, ఆగస్టులో విడుదల

టొయోటా ఇన్నో ఎమ్‌పివికి పోటీగా ప్రవేశపెట్టనున్న తమ ఎమ్‌యూవీని తొలిసారిగా జనవరి 2012లో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శిస్తామని, ఆగస్టు 2012లో వాణిజ్య పరంగా మార్కెట్లోకి విడుదల చేస్తామని నిస్సాన్ మోటార్ ఇండియా ఛీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ సునీల్ రీఖీ తెలిపారు. ఇప్పటికే నిస్సాన్-అశోక్ లేలాండ్ జాయింట్ వెంచర్ ఓ చిన్న తరహా వాణిజ్య వాహణం (ఎల్‌సివి) అశోక్ లేలాండ్ దోస్త్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో నిస్సాన్ మైక్రా, సన్నీ మోడళ్లను మాత్రమే భారత్‌లో ఉత్పత్తి చేస్తుంది. ఇవికాకుండా ఎక్స్-ట్రైల్ ఎస్‌యూవీ, టియానా సెడాన్, 370 జెడ్ స్పోర్ట్స్ కార్లను సిబియూ రూట్లో దిగుమతి చేసుకుని విక్రయిస్తుంది.


Click it and Unblock the Notifications








