మహీంద్రా ఎక్స్‌యూవీ500 టాప్-ఎండ్ బుకింగ్స్ నిలిపివేత!

Mahindra XUV500
ఎస్‌యూవీల తయారీలో పేరుగాంచిన దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన తొలి గ్లోబల్ ఎస్‌యూవీ "మహీంద్రా ఎక్స్‌యూవీ500" అపూర్వ స్పందన లభిస్తోంది. ఎంతగా అంటే.. కంపెనీ ఉత్పత్తి సామర్థ్యానికి మించినంతగా. దీంతో ఈ మోడల్‌లో కంపెనీ అందిస్తున్న టాప్ ఎండ్ వేరియంట్ మహీంద్రా ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (ఆల్-వీల్ డ్రైవ్) ఎస్‌యూవీ బుకింగ్‌లను అంగీకరించడాన్ని తాక్కాలికంగా నిలిపివేసింది.

కాగా.. ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ6, ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (టూ-వీల్ డ్రైవ్)ల బుకింగ్‌లు మాత్రం యధావిథిగా కొనసాగుతున్నాయని కంపెనీ పేర్కొంది. మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకు అశేష ఆదరణ లభించడానికి ప్రధానం కారణం, ఈ మోడల్ ధరే. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
* ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ6 (బేస్ వేరియంట్) మోడల్ ధర రూ. 10.80 లక్షలు
* ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (2-వీల్ డ్రైవ్) మోడల్ ధర రూ. 11.95 లక్షలు
* ఎక్స్‌యూవీ500 డబ్ల్యూ8 (ఆల్-వీల్ డ్రైవ్) మోడల్ ధర రూ. 12.88 లక్షలు
(అన్ని ధరలు కూడా ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ డిమాండ్‌ను ముందుగానే ఊహించిన మహీంద్రా, ఈ మోడల్‌ను విడుదల చేయడానికి ముందే కొంత స్టాక్‌ను కూడా సిద్ధం చేసుకుంది. అయితే, భారత మార్కెట్ నుంచి ఊహించిన దాని కన్నా అధికంగా డిమాండ్ వస్తుండటంతో కంపెనీ తాక్కాలికంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీకు 5000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ విడుదల మరి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మహీంద్రాకు ప్రతి నెలా 2,000 ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీలను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. మరికొద్ది నెలల్లోనే దీన్ని 3,000 యూనిట్లకు పెంచాలని కంపెనీ యోచిస్తోంది. రెండు వెర్షన్లలో (టూ-వీల్ డ్రైవ్, ఫోర్-వీల్ డ్రైవ్) లభించే మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో లభిస్తుంది.

ఇందులో 2.2 లీటర్ కామన్-రైల్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది సుమారు 140 బిహెచ్‌పిల శక్తిని, 33 కెజిఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఎల్‌ఈడి లైట్లు, టచ్-ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్, ఈఎస్‌పి మరియు బ్లోవర్ కంట్రోల్స్ వంటి అత్యాధునిక సాంకేతిక, భద్రతా ఫీచర్లు ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీ సొంతం.

More from DriveSpark

Article Published On: Sunday, October 9, 2011, 9:47 [IST]
English summary
Mahindra & Mahindra's latest global SUV XUV500 is receiving an overwhelming. So far the bookings this model crossed more than 5000 units. Due to the overwhelming response for the XUV500 W8 AWD (top-end variant), Company have stopped accepting fresh bookings for the W8 AWD variant at this point in time. But it continue to accept bookings for the W6 and W8 2WD variants.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+