వర్కర్ల డిమాండ్లను అంగీకరించే ప్రశ్నే లేదు: మారుతి సుజుకి

Strike at Maruti Manesar Plant
ఇండియా నెంబర్ వన్ కార్ కంపెనీ మారుతి సుజుకి మానేసర్ ప్లాంటులో వర్కర్లు చేపట్టిన సమ్మె నేటితో వరుసగా ఐదో రోజుకు చేరింది. మానేసర్ ప్లాంటులో కొత్తగా ఏర్పాటు చేసిన వర్కర్ల యూనియన్‌ను యాజమాన్యం గుర్తించాలంటూ శ్రామికులు గత శనివారం మధ్యాహ్నం నుంచి సమ్మె ప్రారభించిన సంగతి తెలిసిందే. అయితే వర్కర్ల డిమాండ్లకు యాజమాన్యం తలొగ్గే సూచనలు కనబడటం లేదు. కార్మికుల డిమాండ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించబోమని మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) చైర్మన్ ఆర్‌సి భార్గవ తెలిపారు.

యూనియన్ రిజిస్టర్ కాకుండానే, ప్రస్తుత పరిస్థితుల్లో వారి డిమాండ్లను ఎలా అంగీకరిస్తామని ఆయన ప్రశ్నించారు. సమ్మె కారణంగా ఐదో రోజు కూడా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దాదాపు 2,000 మంది వర్కర్లు గత శనివారం నుంచి సమ్మె నిర్వహిస్తున్నారు. నిన్నటి వరకూ కంపెనీ సుమారు 3,000 యూనిట్ల ఉత్పత్తిని నష్టపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఎమ్ఎస్ఈయూ (మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్)ను యాజమాన్యం గుర్తించాలనేది వారి ప్రధాన డిమాండ్.

మానేసర్‌లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మరో రెండు యూనిట్లలో కూడా కాంట్రాక్టు లేబర్‌ను కొనసాగించాలని వారి మరో డిమాండ్. ప్రస్తుతం మానేసర్‌ ప్లాంటులో మారుతి ఉద్యోగ్ కామ్‌గర్ యోజన (ఎమ్‌యూకెయూ) అనే యూనియన్ ఉంది. అయితే ఈ యూనియన్‌లో ఎక్కువగా గుర్గావ్ యూనిట్‌కు చెందిన వర్కర్లే ఉన్నారు. దీంతో తమ కొత్త యూనియన్‌ను అంగీరించి తీరాల్సిందేనని మానేసర్ కార్మికులు, అంగీకరించే ప్రశ్నే లేదని యాజమాన్యం మొండి పట్టు పడుతున్నాయి. ఫలితంగా కంపెనీకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 8, 2011, 15:28 [IST]
English summary
Workers strike at Maruti Suzuki's Manesar plant entered the fifth day today, Company said there was no question of accepting the demands of the workers. "When a union is not even registered, in today's condition, how can we even think of accepting their demands? There is no demand of the workers which we can accept," MSI Chairman RC Bhargava said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+