కార్ థెఫ్ట్‌లకు చెక్..: నోయిడా, ఘజియాబాద్‌లలో కార్లకు జిపిఎస్ తప్పనిసరి

గతంలో కూడా ఇలాంటి మరో కేసును జిపిఎస్ ద్వారా పోలీసులు గుర్తించి కేసును ఛేదించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఘజియాబాద్ ఎస్‌ఎస్‌పి వాహన డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి కార్లలో జిపిఎస్ వ్యవస్థను తప్పనిసరి చేసే అంశం గురించి చర్చించారు. అయితే వేరే ఏజీన్సీల ద్వారా ఈ పరికరాన్ని వాహనాల్లో అమర్చడం వల్ల అది కార్ మెకానిజానికి అంతరాయం కలిగించే అవకాశం ఉందని, ఇటువంటి సాంకేతిక సమస్యలను సరిచేసేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని గౌతమ్ బుద్ధ నగర్ రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ లాల్‌జీ చౌదరి అన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం నాయిడాలో ప్రతి నెలా 200 వాహనాలు దొంగింలించబడుతున్నాయి.
జిపిఎస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది..:
శాటిలైట్ ద్వారా జిపిఎస్ సిస్టమ్ వాహనాలను పర్యవేక్షిస్తుంటుంది, దీని వల్ల ప్రయాణికుడు తాను లేదా తన వాహనం ఏ ప్రాంతంలో ఉన్నదనే విషయాన్ని గుర్తించండం వీలవుతుంది. ఒకవేళ వాహనం దొంగింలించబడినట్లయితే ఈ సిస్టమ్ ద్వారా వాహనం ఏ రూట్లో ప్రయాణిస్తుందో లేదా ఏ ప్రాంతంలో ఉందో గుర్తించడం వీలవుతుంది. తక్కువ రకం జిపిఎస్ సిస్టమ్ ఖరీదు దాదాపు. రూ. 6,000 అవుతుంది. సుమారు 5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయలు వెచ్చించి కార్లను కొనుగోలు చేసేవారికి ఈ మొత్తం పెద్ద పెట్టుబడేమి కాదు. పైగా వినియోగదారుల కారు భద్రత కోసం వెచ్చించే వన్-టైమ్ ఇన్వెస్టిమెంట్. అయితే.. కార్లలో ఈ జిపిఎస్ వ్యవస్థను తప్పనిసరి చేయడం పట్ల మార్కెట్ నుంచి అంతగా స్పందన రావడం లేదని నోయిడా డీలర్లు అంటున్నారు. కాబట్టి మీ కారును సేఫ్‌గా ఉంచుకోవాలనుకుంటే.. వెంటనే జిపిఎస్ సిస్టమ్‌ను అమర్చుకోండి.


Click it and Unblock the Notifications








