ఏప్రిల్ 2, 2011 తేది భారతదేశ చరిత్రలో ఓ ప్రత్యేక రోజుగా నిలిచిపోనుంది. ముంబై మహానగరంలో భారత్-శ్రీలంకలు క్రికెట్ ప్రపంచ కప్ 2011 కోసం తలపడనుండటమే ఈ తేదికి ఉన్న ప్రత్యేకత. మరి ఈ తేది తర్వాత భారతదేశ చరిత్రలో అంతే ప్రత్యేకతను సంతరించుకోనున్న తేది 'అక్టోబర్ 29, 2011'. భారత్ తొలిసారిగా 'ఇండియన్ ఫార్ములా 1 జిపి' రేస్‌కు ఆతిథ్యమిస్తుండటమే ఈ తేదికి ఉన్న ప్రత్యేకత. అత్యంత అరుదైన ఈ కార్యక్రమానికి నోయిడా వేదిక కానుంది. ఫార్ములా 1 ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ కోసం దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న నోయిడా రేస్‌ట్రాక్ ముస్తాబవుతోంది.