నోకియా కాంటెస్ట్ ద్వారా సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ చూసే ఛాన్స్

Nokia Smart Phone
మీకు మొబైల్ ఫోన్‌లో గేమ్స్ ఆడటం అంటే చాలా ఇష్టమా..? గేమింగ్‌లో మీరు జెమ్స్ గనుక అయితే.. మీలాంటి వారి కోసమే దేశపు అగ్రగామి మొబైల్ ఫోన్‌ల తయారీ సంస్థ 'నోకియా' ఈ బంపర్ ఆఫర్‌ను అందిస్తోంది. నోకియా అందిస్తున్న మొబైల్ ఫోన్ 'ఎక్స్‌7'లో ఉన్న గేమింగ్‌ సామర్థ్యంపై విస్తృతమైన అవగాహన కల్పించేందుకు నోకియా 'ఫుల్‌ త్రోటిల్‌ గేమింగ్‌ టోర్నమెంట్‌'ను కంపెనీ ప్రారంభించింది.

ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన ఫుల్‌ త్రోటిల్‌ గేమింగ్‌ టోర్నమెంట్‌ ఆగస్టు 7వ తేదీన ముగియనుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీ, కోల్‌కత, ముంబయి, పుణె, చండీగఢ్‌లలో ఉన్న 150కి పైగా నోకియా రిటైల్‌ అవుట్‌లెట్లలోను మరియు మల్టీ బ్రాండ్‌ మొబైల్‌ రిటైల్‌ స్టోర్లలోనూ ఈ టోర్నమెంట్‌ను నోకియా కంపెనీ నిర్వహిస్తోంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా సదరు అవుట్‌లెట్లకు వెళ్లి మీ గేమింగ్ సామర్థ్యాన్ని చూపించడమే.

అలా వెళ్లలేని వాళ్లి ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్టర్‌ చేసుకుని కూడా గేమ్‌లను ఆడొచ్చు. ఈ పోటీలో అత్యధిక స్కోర్‌ చేసిన వారికి ఈ ఏడాది సెప్టెంబరులో సింగపూర్‌లో జరిగనున్న ఎఫ్‌1 గ్రాండ్‌ ప్రిక్స్‌ కార్ రేస్‌ను చూసే అవకాశాన్ని కంపెనీ కల్పించనుంది. శుక్రవారం బెంగళూరులో ఈ టోర్నమెంటు ప్రారంభమైంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే నోకియా షోరూమ్‌కి వెళ్లి గేమ్ ఆడి సింగపూర్‌కి వెళ్లండి..!

More from DriveSpark

Article Published On: Saturday, July 16, 2011, 12:52 [IST]
English summary
Nokia has started the Full Throttle Gaming tourtnament to raise awareness about its X7 Gaming mobile phone. Nokia promises this smart phone will offer best in class performance. In an added incentive the mobile phone manufacturer is offering winners of this tournament once in a lifetime opportunity to see the Formula 1 Singapore night Grand Prix.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+