బెంజ్ బాటలోనే బిఎమ్‌డబ్ల్యూ: అతి త్వరలో కార్ లీజింగ్ బిజినెస్

BMW Car Leasing
ఇటీవలే జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో తమ కార్లను అద్దెకు ఇచ్చే వ్యాపారాన్ని (కార్ లీజింగ్ ఫైనాన్స్) ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు తాజాగా.. జర్మనీకు చెందిన మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ కూడా మెర్సిడెస్ బెంజ్ కోవలోనే ప్రయాణించాలి యోచిస్తోంది.

భారత మార్కెట్లో తాము కూడా లీజు పద్దతి ప్రకారం తమ కార్లను వినియోగదారులకు అందించాలని బిఎమ్‌డబ్ల్యూ యోచిస్తోంది. దీనిపై బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు ఆండ్రియాస్ స్కాఫ్ మాట్లాడుతూ.. "భారత్‌లో లీజింగ్ పద్ధతిని పరిచయం చేసిన తొలి కంపెనీగా బిఎమ్‌డబ్ల్యూ అతరించనుంద"ని చెప్పారు.

అయితే, ఇందుకు సంబంధించిన ఖచ్ఛితమైన సమయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. భారత్‌లో ఈ విధాన్ని ఎప్పుడు పరిచయం చేస్తారన్న ప్రశ్నకు ఆయన "అతి త్వరలో" అని సమాధానం ఇచ్చారు. భారత లగ్జరీ కార్ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్‌కు, బిఎమ్‌డబ్ల్యూకి మధ్య మంచి పోటీ వాతారణ ఉన్న సంగతి తెలిసిందే.

దశాబ్ధాలుగా భారత లగ్జరీ కార్ మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న మెర్సిడెస్ బెంజ్‌ను బిఎమ్‌డబ్ల్యూ ఇటీవలే అధిగమించి ప్రధమ స్థానాన్ని చేజిక్కుంచుంది. ఈ నేపథ్యంలో తన స్థానాన్ని పదిలంగా కాపాడుకునేందుకు తమ ప్రత్యర్థి (మెర్సిడెస్ బెంజ్) కన్నా ముందుగా తామే లీజింగ్ వ్యాపారాన్ని ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, October 28, 2011, 17:04 [IST]
English summary
Another luxury carmaker from Germany is ready to offer their luxury cars on lease basis in India. After Mercedes Benz announced to introduce the Car Leasing facility in India, Now BMW is also considering to launch and commence its car leasing facility in India very soon.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+