రోడ్లే కాదు.. నీరు, నేల, మంచుపై కూడా ఈ కారు ప్రయాణిస్తుంది

Volkswagen Aqua
నీటిపైనా, నీటిలోపల, ఇసుక రోడ్లయినా సరే, మట్టి రోడ్లయినా సరే పైనా, మంచు రోడ్లయినా సరే, మామూలు రోడ్లయినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే... రైడ్‌కు రెడీ అంటోది ఈ 'ఫోక్స్‌వ్యాగన్ ఆక్వా' కారు. చక్రాలు మాత్రం ఉండవు, కానీ చక చకా దూసుకుపోతుంది. ఇదేమన్నా మన పాత తెలుగు విఠలాచార్య సినిమానో లేక లేటెస్ట్ జేమ్స్‌బాండ్ సినిమానో అనుకుంటున్నారా... అదేం కాదు. ఇది నూటికి నూరుపాళ్లు నమ్మలేని నిజం. మానవుని తెలివితేటలకు అత్యాధునిక సాకంకేతిక పరిజ్ఞానాకి పరాకాష్టే ఈ ఆల్ టెర్రైన్ సూపర్ స్పోర్ట్స్ కారు.

చైనాకు చెందిన ఓ 21 ఏళ్ల టీనేజర్ సృష్టికి ప్రతిసృష్టి చేసి ఈ కాన్సెప్ట్‌ను రూపొందించాడు. ఇతని ఊహలకు జపాన్‌కు చెందిన ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ ప్రాణం పోసింది. సిన్హువా యూనివర్సిటీలో మెకానికల్ విద్యార్థి యువాన్ ఝాంగ్ (21) అనే కుర్రాడు వోక్స్‌వ్యాగన్ నిర్వహించిన ఓ కాంపిటీషన్ కోసం ఈ కారుకు డిజైన్ చేశాడు. ఈ కారులో చక్రాలకు బదులుగా నాలుగు హైపవర్ ఫ్యాన్లు ఉంటాయి. అందులో రెండు ఫ్యాన్లు కారు కిందివైపు ఎయిర్ బ్యాగ్స్‌లను తయారయ్యేలా చేస్తాయి. దీనివల్ల కారు ఉపరితలం నుంచి కొంత ఎత్తు (గ్రౌండ్ క్లియరెన్స్) గాల్లోకి లేస్తుంది.

మిగిలిన రెండు ఫ్యాన్లు ముందుకు, వెనుకకు కదలడానికి ఉపయోగపడతాయి. ఇందులో హైడ్రోజన్‌ను ఇంధనంగా వినియోగించుకునే రెండు మోటార్లు ఉంటాయి. ఇది దాదాపు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ముందు భాగంలో ఇది గంటకు గరిష్టంగా 65 మైళ్ల (సుమారు 100 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 14, 2011, 11:06 [IST]
English summary
A 21-year-old Chinese designer Yuhan Zhang and Japanese auto gaint Volkswagen are developed a car called ‘Volkswagen Aqua’. This all-terrain vehicle will run on roads, sand, ice - and even water.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+