టొయోటాను ఓవర్‌టేక్ చేసిన జిఎమ్, ఫోక్స్‌వ్యాగన్

కానీ, టొయోటా మాత్రం రెండో స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. జర్మనీకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ కూడా టొయోటాను ఓవర్‌టేక్ చేసి రెండో స్థానాన్ని ఎగరేసుకుపోయింది. దీంతో టొయోటా ఏకంగా మూడో స్థానానికి దిగజారిపోయింది.
ప్రస్తుత సంవత్సరం (2011) ప్రథమార్థం(జనవరి-జూన్ 2011)లో టొయోటా ప్రపంచ వ్యాప్తంగా 37 లక్షలు (3.7 మిలియన్) వాహనాలను మాత్రమే విక్రయించింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 11 శాతం తక్కువ. ఇందుకు ముఖ్య కారణం ఈ ఏడాది మార్చి నెలలో జపాన్‌లో సంభవించిన భూకంపం, సునామీలే ప్రధాన కారణం. ఊహించని రీతిలో సంభవించిన ఈ ప్రకృతి భీభత్సం టొయోటాపై తీవ్ర ప్రభావాన్ని చూపిందనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అవసరం లేదేమో.
కాగా.. ఇదే సమయంలో జనరల్ మోటార్స్ ప్రపంచ వ్యాప్తంగా 45 లక్షల (4.5 మిలియన్) వాహనాలను విక్రయించి నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంటే, 41.3 లక్షల (4.13 మిలియన్) వాహనాల అమ్మకాలతో ఫోక్స్‌వ్యాగన్ ద్వితీయ స్థానాన్ని ఆక్రమించుకుంది.


Click it and Unblock the Notifications