నానో మాత్రమే కాదు 'స్విఫ్ట్ డిజైర్‌' కూడా బర్నింగ్ కారే..

సెప్టెంబర్ నెల కార్ల కంపెనీలు పెద్దగా కలిసి రావడం లేదు. ఒక్కో కారు తర్వాత మరో కారు మంటల్లో కాలి బూడిద అవుతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకూ మూడు టాటా నానో కార్లు మంటల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలా మంటల్లో కాలిపోతున్న కార్ల జాబితాలో ఇప్పటి వరకూ మనం టాటా నానో కారును మాత్రమే గమనించాం.

కాగా... తాజాగా, మారుతి సుజుకి కూడా "బర్నింగ్ కార్" జాబితాలోకి చేరిపోయింది. గురువారం ఉదయం తెల్లవారు జామున ముంబైలోని ఓ స్విఫ్ట్ డిజైర్ కారులో ఉన్నట్టుండి మంటలు అంటుకున్నాయి. అమిత్ మిత్రాకు చెందిన ఓ స్విఫ్ట్ డిజైర్ కారు ముంబై విక్రోలీ ఎక్స్‌ప్రెస్‌వేలో మంటల్లో పూర్తిగా కాలిపోయింది. అమిత్ ఔరంగాబాద్ నుండి ముంబై వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

సుమారు ఎనిమిది లక్షల విలువైన ఈ కారును అమిత్ గడచిన మూడు నెలల క్రితం కొనుగోలు చేశారు. ప్రాధమిక సమాచారం ప్రకారం, అధిక దూరం ప్రయాణించిన కారణంగా ఇంజన్ ఓవర్‌హీట్ అయి ప్రమాదం సంభవించి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మారుతి సుజుకి ఇంత వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

More from DriveSpark

Article Published On: Thursday, September 22, 2011, 13:48 [IST]
English summary
A new car now joins the list of four-wheelers catching fire. A news report on NDTV has said a three month old Swift DZire caught fire in Mumbai and burned down completely. The fairly new DZire was being driven from Aurangabad to Mumbai.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+