అసలు డ్రైవరే అవసరం లేని ఆటోమేటిక్ కారు

Automatic Car
రద్దీ రోడ్లపై రోజూ డ్రైవింగ్ చేయాలంటే చిరాకుగా ఉంటోందా..!? అయితే, భవిష్యత్తులో మీకు ఆ బాధ ఉండదు. ఇకపై కార్లు మాట్లాడగలవు, చూడగలవు అసలు మనిషి అవసరం లేకుండానే దానంతట అవే డ్రైవ్ చేసుకుని చక్కగా రోడ్లపై సవారీ చేయగలవు. భవిష్యత్ కారు (ఫ్యూచర్ కార్)గా చెప్పుకొనే పూర్తి కంప్యూటర్ నియంత్రిత కారు ఇప్పుడు బెర్లిన్‌ రోడ్లపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది.

ఫ్రీ యూనివర్సిటీకి చెందిన పరిషోధకులు ప్రస్తుతం ఆ వాహనాన్ని జర్మన్ రాజధాని రోడ్లపై పరీక్షిస్తున్నారు. రద్దీలో ఎదురుగుండా ఉండే వాహనాలను గుర్తించేందుకు ముందువైపు ఓ కెమెరాను, కారు పైభాగంలోనూ మరియు ముందు బంపర్ చుట్టూ లేజర్ స్కానర్లను అమర్చారు.

ఇది శాటిలైట్ నేవిగేషన్ సిస్టమ్ (జిపిఎస్) ఆధారంగా పనిచేస్తుంది. వీటన్నింటినీ నియంత్రించేందుకు కారు లోపలి భాగంలో ఓ కంప్యూటర్‌ కూడా అమర్చబడి ఉంటుంది. రోడ్డుపై ఉండే ఇతర కార్లు, పాదచారులు, భవంతులు మరియు చెట్లు 70 మీటర్ల దూరంలో ఉండగానే ఇది గుర్తిస్తుందని, అంతేకాకుండా.. ట్రాఫిక్ లైట్లు రెడ్‌లో ఉన్నాయా లేదా గ్రీన్‌లో ఉన్నాయా అనే విషయాన్ని కూడా ఇది గుర్తించగలదని, యూనివర్సిటీ రీసెర్చ్ గ్రూప్ హెడ్ రౌల్ రోజస్ తెలిపారు.

వాతావరణంలోని మార్పులను మనుషుల కన్నా వేగంగా ఇది గుర్తించగలదని ఆయన చెప్పారు. పరిశోధకులు వారి పరిశోధన కోసం ఫోక్స్‌వ్యాగన్ పస్సాట్ కారును ఉపయోగించారు. నాలుగేళ్ల పాటు పరిశోధన చేసి ఈ వ్యవస్థను రూపొందించారు. అయితే, ఇప్పటికే ఇలాంటి టెక్నాలజీపై గూగుల్ పరిశోధనలు నిర్వహిస్తుండగా, నెవాడాలో టొయోటా కంపెనీ ఓ రోబోటిక్ ప్రియుస్ కారుతో పరిశోధనలు జరుపుతోంది. ఏదైతేనం ఈ వ్యవస్థ నిజంగా అందుబాటులోకి వస్తే.. డ్రైవర్ ఖర్చులు మిగలడం ఖాయం.

More from DriveSpark

Article Published On: Wednesday, September 21, 2011, 15:24 [IST]
English summary
In future, Your car can talk, see, drive and no longer needs your support to control it by remote. Berlin based Freie University, Germany researchers have developed an automatic car, which is completely computer controlled. Now this car is under testing phase.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+