ఇండియన్ గ్రాండ్ ప్రి కోసం 20 వేలకు పైగా టికెట్లు సేల్

"మేము ఇప్పటికే 20,000 లకు పైగా టికెట్లను విక్రయించాం, ఇందులో ఎక్కువగా ఆన్‌లైన్ ద్వారానే విక్రయించాం. వీటిల్లో అధికంగా రూ.2,500 ధర కలిగినవే. ప్రజలు ఇప్పుడు అధిక ధర కలిగిన టికెట్లను కొనుగోలు చేస్తున్నార"ని జేపీఎస్ఐ జాయింట్-ప్రసిడెంట్ బిపుల్ పథాక్ విలేఖరులతో అన్నారు. గ్రాండ్ ప్రి టికెట్ల ధరలు రూ.2,500 నుండి రూ.35,000 వరకూ ఉన్నాయి.
మరోవైపు అక్టోబర్ నెలలో జరగనున్న ఈ ఫార్ములా వన్ రేసు కారణంగా పర్యాటకుల తాకిడితో ఢిల్లీ కళకళలాడుతోంది. ఢిల్లీలోని దాదాపు అన్ని హోటళ్లు హౌస్‌ఫుల్ బోర్డును పెట్టేస్తున్నాయి. కాగా.. భారతదేశంలోనే తొలిసారిగా జరగనున్న గ్రాండ్ ప్రి ఆఫ్ ఇండియా గ్రేటర్ నోయిడాలోని బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి)లో అక్టోబర్ 30, 2011న జరగనుంది. బిఐసి మొత్తం లక్ష మందికి ఆతిధ్యమివ్వనుంది.


Click it and Unblock the Notifications








