రోడ్డు ప్రమాదాల కారణంగా 2007-09లో 3.6 లక్షలకు పైగా ప్రజలు మృత్యువాత

అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 4.84 శాతం పెరిగినట్లు రోడ్డు రవాణా మంత్రి తుషార్ చౌదరి రాజ్య సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. రోడ్డు ప్రమాదాల కారణంగా 2008లో 1,19,860 మరణాలు మరియు 2007లో 1,14,444 మరణాలు సంభవించినట్లు ఆయన వెల్లడించారు.
కాగా.. 2009లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని, వీటిల్లో అధికంగా అరుణాచల్ ప్రదేశ్ (14,770 మృతులు) మరియు ఉత్తరప్రదేశ్ (14,638 మృతులు) నమోదైనట్లు చౌదరి చెప్పారు. అలాగే తమిళనాడులో 17,746 మరణాలు మరియు మహారాష్ట్రలో 11,396 మరణాలు నమోదైనట్లు ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








