ఫియట్‌తో భాగస్వామ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి: రతన్ టాటా

Ratan Tata
టాటా మోటార్స్ అధినేత రతన్ టాటా ఇటాలియన్ కార్ల తయారీ కంపెనీ 'ఫియట్‌'తో ఏర్పరుచున్న భాగస్వామ్యం వల్ల ఇంత వరకూ ఒరిగింది ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జెడి పవర్‌ రూపొందించిన ఓ నివేదికకు గానూ ఇచ్చిన ఇంటర్వ్యూలో రతన్ టాటా మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ ఫియట్‌తో ఏర్పాటు చేసుకున్న వెంచర్ తాము ఆశించినంతగా పనిచేయడం లేదని చెప్పారు. ఫియట్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్గియో మార్చియోన్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధం గురించి రతన్ టాటా ప్రస్థావించారు.

ఇండియాలో ఇప్పటికీ తమకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, డీలర్‌షిప్ నెట్‌వర్క్ లేని ఇటాలియన్ కంపెనీ ఫియట్, భారత మార్కెట్లో మరిన్ని మోడళ్లను తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. 2007 సంవత్సరంలో ఫియట్‌కు మరియు టాటా మోటార్స్‌కు మధ్య కుదిరిన 50:50 జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ ప్రకారం, రెండు కంపెనీలు జాయింట్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ మరియు బ్యాక్-ఎండ్ సపోర్ట్‌లకు అంగీకరించాయి. టాటా మోటార్స్ షోరూమ్‌లను గమనించినట్లయితే, దాదాపు ప్రతి షోరూమ్‌లోనూ ఫియట్ బ్రాండ్ కార్లు ఉంటాయి.

అలాగే, డీలర్‌షిప్‌ లోగోల్లో రెండు కంపెనీలకు చెందినవి ఉంటాయి. దీనికి తోడు పూణేకు సమీపంలో ఉన్న రంజన్‌గావ్ ఫ్యాక్టరీలో ఇరు కంపెనీలు సంయుక్తంగా ఉత్పత్తులను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఫియట్ కూడా ఈ జాయింట్ వెంచర్ తప్పుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. టాటా-ఫియట్ జాయింట్ డీలర్‌షిప్ నెట్‌వర్క్ కారణంగా తమ బ్రాండ్ కార్లపై కన్నా టాటా బ్రాండ్ కార్లపైనా వినియోగదారులు శ్రద్ధ చూపుతున్నారని, అందుకే తాము భారత్‌లో స్వతంత్రంగా కార్యకలాపాలు ప్రారంభించనున్నామని ఫియట్ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 14, 2011, 15:30 [IST]
English summary
Tata Motors Chairman Ratan Tata has said the association with Italian carmaker Fiat needs to be critically examined to optimize its potential. In an interview in market research firm JD Power's report on 'India Automotive 2020: The Next Giant from Asia' Tata said his good personal rapport with Fiat Chief Executive Officer Sergio Marchionne has not been translated at the working level of the two firms.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+