మరో ఐదేళ్లలో ఏటా 56 లక్షల కార్ల అమ్మకాలు: ఎస్ఐఏఎమ్

12వ పంచవర్ష ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఏఎమ్ వేసిన అంచనాల ప్రకారం దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 56 లక్షల యూనిట్లు గానూ మరియు ఎగుమతులు 13 లక్షల యూనిట్లుగా ఉండొచ్చని పేర్కొంది. వడ్డీ రేట్లు, ఇంధన ధరల పెరుగుదల కారణంగా మందగించిన వాహన విక్రయాలు ప్రస్తుత పండుగ సీజన్‌లో మళ్లీ ఊపందుకుంటాయని ఎస్ఐఏఎమ్ అధ్యక్షుడు పవన్ గోయెంకా అన్నారు.
ఇదిలా ఉండగా ఎస్ఐఏఎమ్ కొత్త అధ్యక్షునిగా ఐషర్ గ్రూప్ చైర్మన్ ఎస్ శాండిల్య ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా టయోటా కిర్లోస్కర్ మోటార్స్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్, కోశాధికారిగా ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ మైఖేల్ బోన్‌హామ్‌ను ఎన్నుకున్నట్లు ఎసేఐఏఎమ్ పేర్కొంది.


Click it and Unblock the Notifications








