బిఎమ్‌డబ్ల్యూ డైరెక్టర్ రోడ్నీ అరెస్టుకు రంగం సిద్ధం

BMW
ఉన్నత వర్గాలు ప్రతిష్టాత్మకంగా భావించే బిఎమ్‌డబ్ల్యూ సిరీస్ 7 కారులో లోపాలు ఉన్నాయంటూ పవన్ అనే వినియోగదారుడు మంగళవారం సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ ఇచ్చిన ఫిర్యాదుతో సిసిఎస్ పోలీసులు భారత్‌లోని బిఎమ్‌డబ్ల్యూ డైరెక్టర్ రోడ్నీని అదుపులోకి తీసుకున్నారు.

రోడ్నీతో పాటు చీఫ్ ఫైనాన్షియర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం నుండి సిసిఎస్ పోలీసులు రోడ్నీని, చీఫ్ ఫైనాన్షియర్‌ను ప్రశ్నిస్తున్నారు. పవన్ ఫిర్యాదు మేరకు రోడ్నీని అరెస్టు చేసేందుకు కూడా పోలీసులు సిద్ధపడుతున్నట్లుగా సమాచారం. అయితే కార్లలో లోపాలకు తమ సంబంధం లేదని చెబుతూ రోడ్నీ హైకోర్టు నుండి స్టే తెచ్చుకున్నారు.

ఈ కేసులో సిసిఎస్ పోలీసులు విచారణ కొనసాగుతుంది. రోడ్నీ స్టే తెచ్చుకున్నందువల్ల రేపు కోర్టులో వాదోపవాదాలు జరిగిన అనంతరం అరెస్టు అంశం తేలనుంది. కాగా కస్టమర్ పవన్ బిఎమ్‌డబ్ల్యూ కారులో లోపాలు ఉన్నట్టు కంపెనీ దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ వారు నిర్లక్ష్యం వహించినట్లుగా చెబుతున్నట్టుగా తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 19, 2011, 15:26 [IST]
English summary
Pawan customer of BMW was complaint against BMW car company for loop holes in car in CCS police station. CCS police under take BMW director Rodney for investigation.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+