టాటా నానో ఇప్పుడు జస్ట్ రూ.1.35 లక్షలు మాత్రమే..

అన్ని టాటా నానో వేరియంట్లకు కూడా డౌన్‌పేమెంట్ కేవలం రూ.15,000 మాత్రమే. సులభ వాయిదాల పద్ధతి (ఈఎమ్ఐ)లో టాటా నానో కారును కొనుగోలు చేస్తే నెలవారీ వాయిదాలు కింది విధంగా ఉంటాయి:
ఆన్-రోడ్ ధరపై రూ.15,000 డౌన్‌పేమెంట్ చొప్పున 60 నెలల (ఐదు సంవత్సరాలు) టెన్యూర్‌కు గానూ ఈఎమ్ఐలు:
* టాటా నానో స్టాండర్డ్ - రూ.3400
* టాటా నానో సిఎక్స్ - రూ.4165
* టాటా నానో ఎల్ఎక్స్ - రూ.4785
ఇవే కాకుండా ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, టాటా మోటార్ ఫైనాన్స్‌ల నుండి ఇతర ఫైనాన్సింగ్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇకపోతే టాటా నానో విషయానికి వస్తే.. ఇది ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, భారత్‌లోనే అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కారు. బెస్ట్-ఇన్-క్లాస్ అయిన టాటా నానో 4 ఏళ్లు/60,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది. స్టాండర్డ్ స్మాల్ కారు కన్నా ఇది 21 శాతం అధిక స్పేస్‌ను కలిగి ఉంటుంది.
టాటా నానో టర్నింగ్ రేడియస్ కూడా చాలా తక్కువ (4మీటర్లు మాత్రమే). ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకూ మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం వెంటనే ఈ బుజ్జి కారును మీ ఇంటికి తీసుకువెళ్లి ఈ దీపావళి పండుగను మరింత శోభాయమానంగా జరుపుకోండి.


Click it and Unblock the Notifications








