ఇంధన ధరల పెంపుతో కార్ల డిమాండ్ తగ్గుతుంది: ఆటో కంపెనీలు

Petrol Price Hike
ఓ వైపు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యుడు సతమతవుతుంటే... మరోవైపు బ్యాంకులు వెంట వెంటనే వడ్డీ రేట్ల పెంపుతో వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. దీనికి తోడు తాజాగా ప్రభుత్వం పెట్రోల్‌ ధరను లీటర్‌కు ఏకంగా రూ. 5 పెంచాలనుకోవడం గోటి పుండుపై రోకలి పోటుగా మారనుంది. ఇప్పటికే నగరాల్లో పెట్రోల్ ధరలు దాదాపు రూ. 70 తాకుతున్నాయి. పెట్రలో ధరలతో పాటు డీజిల్ ధరలని పెంచడమే కాకుండా, వాటి ధరలపై ప్రభుత్వం నియంత్రణలను ఎత్తివేయనున్నారనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి. ఇదే గనుక జరిగితే ప్రస్తుతం లీటరుకు రూ. 40 ఉన్న డీజిల్ ధర మరికొద్ది నెలల్లోనే రూ. 50-60కు చేరినా ఆశ్చర్యపోనవరసం లేదని విమర్శకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఒక్కసారిగా ఇంత మొత్తంలో ఇంధన ధలను పెంచితే కార్ల అమ్మకాలు మరింత మందగించే అవకాశం ఉందని ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళనవ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రుణాలపై పెరిగిన వడ్డీరేట్లు పరిశ్రమలను గక్కతిప్పుకోనికుండా చేస్తుంటే, తాజా పెంపు తమపై మరింత భారంగా మారే అవకాశం ఉందని కంపెనీలు భయపడుతున్నాయి. 'ఇప్పటికే గత నెలలో కార్ల అమ్మకాల వృద్ధిరేటు తగ్గింది. దీనికి అధిక వడ్డీరేట్లు కారణం. తాజాగా పెట్రోల్‌ ధరలు పెరిగాయి. దీని ప్రభావం ప్రధానంగా స్వల్ప కాలానికి కార్ల గిరాకీపై ఉంటుంది' అని భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్‌) డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథూర్‌ తెలిపారు. 22 నెలల్లో అత్యంత తక్కువగా ఏప్రిల్‌ నెలకు కార్ల అమ్మకాల్లో వృద్ధిరేటు 13.18 శాతానికి పరిమితమైంది.

దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు అయిన మారుతి సుజుకి ఇండియా కూడా.. ఇదే స్థాయిలో ఇంధన ధరలు పెరిగినట్లయితే కార్ల పరిశ్రమలు భారీ ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉందని కంపెనీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (మార్కెటింగ్‌) శశాంక్‌ శ్రీవాత్సవ అన్నారు. పెట్రోల్‌ ధరను లీటరుపై రూ. 5 పెంచడం చాలా ఎక్కువని, ఇప్పటికే సెంటిమెంట్‌ బలహీనంగా ఉందని, ఇదే గనుక జరిగితే భవిష్యత్తులో ఈ సెంటిమెంట్ మరింత బలహీన పడుతుందని దేశీయ రెండవ అతిపెద్ద కార్ల తయారీదారు అయిన హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా డైరెక్టర్‌ (మార్కెటింగ్‌, సేల్స్) అరవింద్‌ సక్సేనా తెలిపారు. కాగా.. ఈ పరిణామాలు కార్ల కొనుగోలుకు వినియోగదారులు దూరంగా ఉండేలా చేస్తుందని జర్మనీ ఆటో దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్‌ సేల్స్‌ ఇండియా బోర్డు సభ్యుడు నీరజ్‌ గార్గ్‌ అన్నారు. రానున్న ఒకటి రెండు నెలల్లో కార్లకు భారీగా గిరాకీ తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 17, 2011, 12:35 [IST]
English summary
The price of petrol was increased by Rs5 effective from the midnight of 14th May. The auto industry which has grown tremendously in the past few years is showing signs of slowing down. The rate of hike in sales growth during April was the slowest according to industry insiders. Diesel prices are also expected to increase soon. Carmakers are fearing sales will be hit due to the hike in fuel prices.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+