భగ్గుమన్న పెట్రోల్.. మరింత తగ్గనున్న పెట్రోల్ కార్ల ధరలు!

ఇదిలా ఉండగా.. నానాటికి పెరుగుతున్న పెట్రోల్ ధరలను చూసి బెంబేలెత్తిపోతున్న కొనుగోలుదారులు పెట్రోల్ కార్లను విడిచి డీజిల్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పెట్రోల్ కార్ల ఇన్వెంటరీ కుప్పలు తెప్పలుగా మిగిలిపోతుంది. మరోవైపు ఇంకో రెండు నెలల్లో పాత సంవత్సరం (2011) పోయి కొత్త సంవత్సరం (2012) కూడా వస్తుండటంతో డీలర్లు, కంపెనీలు స్టాక్ క్లియర్ చేసుకునే పనిలో పడ్డాయి.
వాస్తవానికి సంవత్సరం మారడం వలన కారు మోడల్ ఇయర్ ఒక ఏడాది తగ్గిపోతుంది. అంటే ఉదాహరణకు ఈ సంవత్సరం(2011)లో తయారైన కారును వచ్చే సంవత్సరం(21012)లో కొనుగోలు చేయడం వలన సదరు కారు మోడల్ ఇయర్ 2011గానే ఉంటుంది. అంటే కొనుగోలుదారులు ఒక సంవత్సరాన్ని నష్టపోతున్నారన్నమాట. ఇలా కొనుగోలు చేసిన కారును రీసేల్‌కు పెట్టినప్పుడు అది ధర తక్కువ పలుకుతుంది.
ఈ నేపథ్యంలో పెట్రోల్ కార్ల స్టాక్‌ను తగ్గించుకునేందుకు కంపెనీలు, డీలర్లు పెట్రోల్ కార్లపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ కొత్తగా పెట్రోల్ కారు కొనాలనుకునే వారికి, ఎక్కువ కాలం కారును ఉపయోగించుకోవాలనుకునే వారికి మరియు రీసేల్ గురించి పెద్దగా పట్టించుకోని వారికి ఇది అనువైన అవకాశం. రీసేల్ వ్యాల్యూ గురించి ఆలోచించే వారు ఈ సంవత్సరంలో కారును కొనకపోవడమే మంచిది.


Click it and Unblock the Notifications








