శుక్రవారం నుండి పెరగనున్న పెట్రోల్ ధరలు..!

అమెరికన్ డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకపు విలువ ఏకంగా రూ.53.75కు పడిపోవడంతో ప్రతి లీటర్ పెట్రోల్ అమ్మకంపై చమురు కంపెనీలు 55 - 56 పైసల వరకూ నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలు పెంచే నిర్ణయం చమురు కంపెనీలు గురువారం సమావేశమై ఓ నిర్ణయాన్ని తీసుకోనున్నాయి.
వాస్తవానికి పెట్రోల్ ధరల పెంపు కేవలం 56 పైసలు మాత్రమే అవుతుంది, దీనికి పన్నులు కలుపుకుంటే 66 పైసలు అవుతుంది. గత నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినందు వలన పెట్రోల్ ధరలను చమురు కంపెనీలు తగ్గించాయి. నవంబర్ 16న లీటరుకు రూ.2.22, డిసెంబర్ 1వ తేదీన 78 పైసలు చొప్పున ధరలు తగ్గాయి.
ఇదిలా ఉండగా, పెట్రోల్‌పై గ్రీన్ టాక్స్‌ను కూడా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే గనుక అమలైతే పెట్రోల్ ధరలపై అదనంగా మరో రెండు రూపాయల భారం పడనుంది.


Click it and Unblock the Notifications








