మరోసారి పెట్రోల్ ధరలను సవరించనున్న చమురు కంపెనీలు!?

రీటెయిల్‌గా ప్రతి లీటరు పెట్రోలుపై రూ.2.61 నష్టపోతున్నామని, ఈ లెక్కన రోజుకు పెట్రోల్‌పై రూ.15 కోట్లను నష్టం వాటిల్లుతోందని చమురు కంపెనీలు చెబుతున్నాయి. ఈ నష్టాలను భర్తీ చేసుకోవాలంటే లీటరు పెట్రోల్‌పై కనీసం రూ.3 చొప్పున ధర పెంచక తప్పదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర దాదాపు 64 రూపాయలుగా ఉంది. తాజాగా మరోసారి పెట్రోల్ ధరలను సవరిస్తే ఇది 67 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








