ఆంధ్రకు షాక్.. కొత్త ప్లాంటు కోసం గుజరాత్‌ను ఎన్నుకున్న ప్యూజో

కొత్త ప్లాంటు ఏర్పాటు కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాలను దాదాపు ఏడాది పాటు అధ్యయనం చేసి, సదరు రాష్ట్ర ప్రభుత్వాలతో పలుమార్లు చర్చలు జరిపిన ప్యూజో చివరకు మోడీ సర్కాను ఆశ్రయించింది. గుర్గావ్, పూణే మరియు చెన్నైల తర్వాత ఆటో హబ్‌గా ఎదుగుతున్న గుజరాత్‌లోని సనంద్‌లో రూ. 4,000 కోట్ల పెట్టుబడితో ప్యూజో భారత్‌లో తన తొలి ప్లాంటును స్థాపించనుంది.
దీనిపై కంపెనీ అధికారి ఒకరు స్పందిస్తూ.. ఈ ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలు మరో మూడు రోజుల్లో వెల్లడికానున్నాయని చెప్పారు. పిఎస్ఏ ప్యూజో సీఈఓ (ఏషియన్ ఆపరేషన్స్) గ్రెగోయిర్ ఆలీవెర్‌తో కూడిన కంపెనీ ప్రతినిధి బృందం, కంపెనీ ఇండియన్ ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఫెడ్రిక్ ఫేబర్‌లు గురువారం అహ్మదాబాద్‌కు వచ్చి ఈ ప్రాజెక్టు ఒప్పందం సంతకం చేయనున్నారు.
ఫోర్డ్ మోటార్స్ ప్లాంటు కోసం సనంద్‌లో కేటాయించున్న స్థలంకు సమీపంలోనే ప్యూజోకు కూడా స్థలాన్ని కేటాయించే అవకాశాలున్నాయి. ఇదే ప్రాంతంలో టాటా మోటార్స్ చిన్న కారు 'టాటా నానో' ప్లాంటు కూడా ఉంది. ఈ ప్రాంతం అహ్మాదాబాద్‌కు 40 కి.మీ. దూరంలో ఉంది. వాస్తవానికి ప్యూజో 80వ శాతాబ్ధంలోనే భారత్‌లోని ప్రీమియుర్ గ్రూపుతో కలిసి పనిచేసింది. కానీ 2001లో ఈ జాయింట్ వెంచర్ నుంచి ప్యూజో వైదొలిగింది.


Click it and Unblock the Notifications








