సనంద్‌లో భూమిపూజ ప్రారంభించిన ప్యూజో సిట్రాన్

Peugeot New Plant
ఇదేదో కొత్త సినిమా టైటిలో లేక కొత్త సినిమా స్టిల్లో కాదండోయ్..! ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ పిఎస్ఏ ప్యూజో సిట్రాన్ భారత్‌లో తమ ప్లాంటును ఏర్పాటు చేయడానికి సంవత్సరానికి పైగా మార్కెట్ అధ్యయనం చేసి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలను పరిశీలించి చివరకు గుజరాత్‌ను ఎన్నుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో నేడు గుజరాత్‌లోని సనంద్ ప్రాంతంలో ప్యూజో అధికారులు తమ కొత్త ప్లాంటును భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్యూజో అధికారు ఈ విధంగా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ కార్యక్రమానికి పిఎస్ఏ ప్యూజో సిట్రాన్ మేనేజింగ్ బోర్డ్ మెంబర్ మరియు ఆసియా ఆపరేషన్స్ సీఈఓ గ్రెగోయిర్ ఆలివియర్, ప్యూజో డైరెక్టర్ జనరల్ విన్సెంట్ రామ్‌బౌడ్, పిసిఏ మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రెడ్రిక్ ఫేబర్ మరియు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నరేంద్ర మోడి మాట్లాడుతూ, గుజరాత్ ప్రపంచ ఆటో హబ్‌గా ఎదుగుతుందని, ఇందులో భాగస్వామి అయినందుకు ప్యూజోను అభినందిస్తున్నానని వ్యాఖ్యానించారు. 600 ఎకరాల్లో రూ.4,000 కోట్ల పెట్టుబడితో ప్యూజో ఈ ప్లాంటును నిర్మిస్తోంది. దీని ద్వారా 5,000 మందికి ఉపాధి లభించనుంది. వచ్చే సంవత్సరం జనవరి నెలలో ఢిల్లీలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో ప్యూజో తమ బ్రాండ్‌ను ప్రదర్శనకు ఉంచనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 3, 2011, 16:37 [IST]
English summary
French auto major PSA Peugeot Citroen held today in Sanand the ground-breaking ceremony of its future industrial site in India. Mr. Gregoire Olivier, Member of the Managing Board PSA Peugeot Citroen and CEO of Asian Operations, Mr. Vincent Rambaud, Director General of Peugeot and Mr. Frederic Fabre, Managing Director of PCA Motors India performed the bhoomi poojan and the ground-breaking ceremony.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+