ఎపి లేక టిఎన్: ప్లాంటు ఏర్పాటుపై పియోజియోట్ అయోమయం

Peugeot
ఫ్రెంచ్‌కు చెందిన కార్ల దిగ్గజం పియోజియోట్ సిట్రాన్ భారత్‌లో 100 కోట్ల డాలర్ల పెట్టుబడితో ప్లాంటును నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాధికారులతో కంపెనీ ఉన్నతాధికారుల సంప్రదింపులు జరిపారు. ప్లాంటు ఏర్పాటు కోసం మౌళిక అవసరాలు కలిగిన స్థలాల కోసం కంపెనీ అన్వేషిస్తుంది. ఈ నేపథ్యంలో పియోజియోట్ సిట్రాన్ ఛైర్మన్ ఫిలిప్ వారిన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని కలిసి ఈ విషయంపై సంప్రదింపులు జరిపారు.

వార్షికంగా 20 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఈ ప్లాంటు ప్రారంభమైతే.. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇందుకోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్లాంటును దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ ఫ్రాన్స్ కంపెనీను ఆకర్షించేందుకు భారత ప్రభుత్వం గతంలో ఎకరా స్థలం రూపాయి చొప్పున వెయ్యి ఎకరాలు ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు తమిళనాడులో ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కొత్త సర్కారు ఏర్పడిన తర్వాత.. ఆ ప్రభుత్వం ఇచ్చే రాయితీలను బట్టి ఈ ప్రాజెక్టు విషయాన్ని ఫైనలైజ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. జూన్ 2011 నాటికి ఈ ప్లాంటు ఏర్పాటుపై ఓ స్పషమైన నిర్ణయాన్ని తీసుకుంటామని కంపెనీ అధికారులు వెల్లడించారు. తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తడ ప్రాంతాన్ని, తమిళనాడులో నోకియా ప్లాంటుకు సమీపంలో ఉన్న వల్లమ్ ప్రాంతాలను కంపెనీ అధికారులు పరిశీలిస్తున్నారు.

కాగా.. మౌలిక అవసరాల దృష్ట్యా చెన్నయ్ మెరుగ్గా ఉండటంతో పాటు ఇటీవలే ఆటోమొబైల్ హబ్‌గా అవతరించడంతో కంపెనీ ఎక్కువభాగం తమిళనాడు వైపే మొగ్గు చూపవచ్చునని, అలాగే.. ఆంధ్రప్రదేశ్ సర్కారు అందిస్తున్న రాయితీలను కూడా కంపెనీ పరిగణలోకి తీసుకునే అకాశాలు లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ అసలు విషయం తేలాలంటే జూన్ వరకూ ఆగాల్సిందే మరి.

More from DriveSpark

Article Published On: Friday, March 18, 2011, 14:51 [IST]
English summary
French car-maker Peugeot Citroen chairman Philippe Varin, along with a contingent of his top officials visited, Andhra Pradesh and Tamil Nadu to meet the heads of both the state governments besides checking out the site for its proposed car manufacturing plant in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+