గుజరాత్ సర్కారుతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న ప్యూజో

Narendra Modi
ఫ్రెంచ్ కార్ల దిగ్గజం పిఎస్‌ఏ ప్యూజో సిట్రాన్‌ను గుజరాత్‌కు స్వాగతిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మైక్రోబ్లాగింగ్ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ 'ట్విట్టర్'లో ట్వీట్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన సందేశం యొక్క సారాంశం ఇది. "వృద్ధిలో పాలుపంచుకునేందుకు మరో ఆటో దిగ్గజం ప్యూజోను గుజరాత్ స్వాగతిస్తుంది. వాస్తవ రూపంలో గుజరాత్ ప్రపంచ ఆటోమోటివ్ హబ్‌గా ఎదుగుతుంది".

ఈ మేరకు ప్యూజో కంపెనీ గుజరాత్ సర్కారుతో ఓ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. గుజరాత్‌లోని పారిశ్రామిక ప్రాంతమైన సనంద్‌లో రూ. 4,000 కోట్ల పెట్టుబడితో ప్యూజో తమ తొలి నూతన ప్లాంటును భారత్‌లో ఏర్పాటు చేయనుంది. గుజరాత్ ప్రపంచ ఆటోమొబైల్ తయారీ హబ్‌గా ఎదుగలదని ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు.

ఆటోమొబైల్ విడిభాగాల తయారీ మరియు ఎగుమతుల్లో కూడా సనంద్ మేజర్ హబ్‌గా ఎదుగుతోందని నరేంద్ర మోడీ అన్నారు. సుమారు 584 ఎకరాల స్థలంలో, ప్రారంభ దశలో భాగంగా సాలీనా 1,65,000 వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్లాంటు ద్వారా 5,000 మందికి ప్రత్యక్షంగానూ 25,000 మందికి పరోక్షంగానూ ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. ఈ ఏడాది చివరి నాటికి ప్లాంటు నిర్మాణ పనులను ప్రారంభించాలని నిర్ణయించగా, 2013 చివరి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.

More from DriveSpark

Article Published On: Saturday, September 3, 2011, 12:20 [IST]
English summary
Gujarat Chief Minister Narendra Modi welcomed french auto major PSA Peugeot Citroen to set up their new plant in Sanand. French carmaker signed an agreement with the Government of Gujarat (GoG) to set up an Automobile Manufacturing Plant near Sanand at a cost of Rs.4,000 Crore.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+