మహీంద్రా రేవాకు ధీటుగా పోలారిస్ ఎలక్ట్రిక్ వాహనాలు

జిఈఎమ్‌లో తమకు మంచి ప్యాసింజర్, వాణిజ్య ఉపయోగార్థం ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని, ఈ వాహనాలను భారత్‌లో విడుదల చేయడానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలోనే ఓ మార్కెట్ అధ్యయాన్ని ప్రారంభిస్తామని పోలారిస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ దూబే తెలిపారు. ప్రస్తుతం జిఈఎమ్ వద్ద మూడు ఎలక్ట్రిక్ కార్లు, మూడు వాణిజ్య వాహనాలు ఉన్నాయి.
జీఈఎమ్ ఎలక్ట్రిక్ కార్ల ధరలు రూ.3.7 లక్షల నుండి రూ.6.52 లక్షల మధ్య ఉండగా, వాణిజ్య వాహనాల ధరలు రూ.4.28 లక్షల నుండి రూ.5.80 లక్షల మధ్య ఉన్నాయి. ఈ వాహనాలు గంటకు 50 కి.మీ. వేగంతో పరుగులు తీస్తాయి. పోలారిస్ ఇటీవలే భారత మార్కెట్లోకి తమ ఆఫ్-రోడ్ వాహనాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్‌లో తమ డీలర్‌షిప్‌లను పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications