తగ్గిన డిమాండ్: ఆల్టో, వ్యాగన్ఆర్, రిట్జ్, ఎస్టిలో ఉత్పత్తి కట్

Maruti Alto
ఇటీవలి కాలంలో దేశీయ మార్కెట్లో డిమాండు భారీగా తగ్గిన కారణంగా, మారుతి సుజుకి నుంచి అధికంగా అమ్ముడయ్యే ఆల్టో, వ్యాగన్ఆర్, ఎస్టిలో, రిట్జ్ వంటి హ్యాచ్‌బ్యాక్‌ల ఉత్పత్తిని కుదిస్తున్నట్లు దేశపు అగ్రగామి కార్ల తయారీ సంస్థ పేర్కొంది. 'స్విఫ్ట్ మరియు డిజైర్‌ మోడళ్లు మినహా ఆల్టో, వ్యాగన్ఆర్, ఎస్టిలో, రిట్జ్ వంటి హ్యాచ్‌బ్యాక్‌ల ఉత్పత్తిని మేము తగ్గించేశాం. ప్రస్తుతం మార్కెట్లు ఆశించినంత ప్రోత్సాహకరంగా లేవ'ని మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్‌ఐ) చైర్మన్ ఆర్‌సి భార్గవ తెలిపారు.

మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఉత్పత్తిని సర్దుబాటు చేస్తున్నామని, తగ్గిన డిమాండు కారణంగా కొన్ని మోడళ్లు ఆశించినంతగా అమ్ముడు కావడంలేదని, తమ స్టాక్‌ను సాధారణ స్థాయిలో ఉంచుకునేందుకు ఈ మోడళ్ల ఉత్పత్తి తగ్గిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ మందగమనం స్వల్పకాలికం మాత్రమేనని, రానున్న పండుగల సీజన్‌లో మార్కెట్ ఊపందుకుంటుందని, అయితే, అటు ఆటోమొబైల్ పరిశ్రమ గాని, ఇటు తమ కంపెనీ గాని ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధిని నమోదు చేయడం క్లిష్టతరమని భార్గవ అభిప్రాయపడ్డారు.

కాగా.. ఈ పండుగ సీజన్‌లో తొలిసారిగా కారును కొనాలనుకునే వినియోగదారులను ఆకట్టుకునేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గత ఏడాది కన్నా 22 శాతం ఎక్కువగా డిస్కౌంట్లను అందించనున్నామని కంపెనీ మేనేజింగ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌, సేల్స్‌) మయాంక్‌ పారీక్‌ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Saturday, August 13, 2011, 10:12 [IST]
English summary
India's largest car maker Maruti Suzuki India (MSI) said, it would cut the production Alto, WagonR, Estilo and Ritz hatchbacks in this month due to the sluggish demand in market.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+