బెంగుళూరులో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన పోర్షే
జర్మనీకు చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ పోర్షే, భారతదేశపు ఐటి రాజధానిగా చెప్పుకునే బెంగుళూరులో ఓ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. బెంగుళూరులోని లావెల్లీ రోడ్‌లో సుమారు 4,000 చ.అ. విస్తీర్ణంలో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. "పోర్షే సెంటర్ బెంగుళూర్" అనే పేరుతో కంపెనీ ఈ షోరూమ్‌ను ప్రారంభించింది.
దీనికి అదనంగా సమీపంలో 7,000 చ.అ. విస్తీర్ణంలో ఓ సర్వీస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. తమ కార్ల అమ్మకం తర్వాత (ఆఫ్టర్ సేల్స్) వినియోగదారులకు విలువై సేవలను అందిచాలనే ఉద్దేశ్యంతో నిపుణైలన టెక్నీషియన్ల ద్వారా నిర్వహించబడే ఓ సర్వీసింగ్ సెంటర్‌ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నామని పోర్షే తెలిపింది.
పోర్షే సెంటర్ బెంగుళూర్‌లో, కంపెనీ అందిస్తున్న భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన లగ్జరీ ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) పోర్షే కెయిన్నీలో లభిస్తున్న అన్ని విభిన్న వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో పోర్షేకు ఇది మూడవ డీలర్‌షిప్. ఇప్పటికే బెంగుళూరు, చెన్నైలలో రెండు ప్రపంచస్థాయి షోరూమ్‌లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications









