ఈ ఏడాది భారత్‌కు రానున్న 500 పోర్షే కార్లు

Porsche
భారత్‌లో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థలు అరుదైన రీతిలో అభివృద్ధి కనబరుస్తున్న తరుణంలో పలు విదేశీ కంపెనీలు కూడాఇక్కడ తమ పాదముద్రలను వేయాలనుకుంటున్నాయి. ఈ కోవలోనే జర్మనీకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పోర్షే ఈ ఏడాది భారత మార్కెట్లో 500 యీనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకొంది. గతేడాది విక్రయాలతో పోలిస్తే ఈ ఏడాది కంపెనీ విక్రయాల లక్ష్యంఐదు రెటిలు ఎక్కువ. ఇందుకు గానూ భారత్‌లో తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకునేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. 2010లో పోర్షేకు 131 బకింగ్స్ రాగా.. ఫిబ్రవరి, 2011 నాటికి వాటి సంఖ్య 217కు పెరిగింది.

ప్రస్తుతం భారత్‌లోని ప్రిసిషన్ కార్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ద్వారా పోర్షే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. భారత్లోని పోర్షే కార్లకు ప్రిసిషన్ కార్స్ ఒక అధికారిక దిగుమతిదారు మరియు పంపణీదారు కూడా. భారత్‌లో పోర్షే అందిస్తున్న కెయిన్ ఎస్‌యూవీ కారును పొందాలంటే కనీసం 500 రోజుల సమయం పడుతుంది. ఇతర స్పోర్ట్స్ కార్ మోడళ్లకయితే 100 రోజుల డెలవరీ సమయం పడుతుందని ప్రిసిషన్ కార్స్ తెలిపింది. పోర్షేకు ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్ష కార్ల డిమాండ్ ఉంటుంది.

ఈ కార్లను జర్మనీలోని ఉత్పత్తి కేంద్రంలో పోర్షే తయారు చేస్తుంది. ప్రపంచ మార్కెట్ల నుంచి పోర్షేకు 74,000 యూనిట్ల డిమాండ్ వస్తుంటే.. కంపెనీ ఉత్పత్తి మాత్రం 44,000 యూనిట్లుగా ఉంది. దీన్నిబట్టి పోర్షే బ్రాండ్‌కు ఉన్న డిమాండ్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతం న్యూఢిల్లీ ద్వారా పోర్షే తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. కాగా.. తమ వ్యాపార విస్తరణలో భాగంగా బెంగుళూరు, ఛండీఘడ్, అహ్మదాబాద్, కొచ్చిలలో తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకున్ అంశంపై కంపెనీ దృష్టిసారిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, March 4, 2011, 12:36 [IST]
English summary
Following on the footsteps of other major luxury car makers in India, the German car maker Porsche is targeting to sell 500 units this year. This could account for five times more than its sale volume of last year and in addition there will be expansion of its network to make up its rise in the market. The CEO of Precision Cars India Ltd said Porsche’s sale volume will be around 500 from the last year’s 131 based on the bookings made as on February end- 217 units.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+