బడ్జెట్ 2011 ఎఫెక్ట్..: భారత్‌లో లగ్జరీ కార్ల ధరలు పెంపు..!?

గత బడ్జెట్లలో భారత్‌లో ఇలా సికెడి వ్యాపారం చేసే వారికి.. వారు దిగుమతి చేసుకునే వాహన విడిభాగాలయిన ఇంజన్, గేర్‌బాక్స్, ట్రాన్సిమిషన్ మెకానిజం, చివరకు ఛాసిస్ వంటి వాటిపై దిగుమతి సుంకంలో ప్రభుత్వం 10 శాతం తగ్గింపు (డిస్కౌంట్) ఇచ్చేది. కానీ ప్రస్తుత బడ్జెట్ సవరణ ప్రకారం ఈ విడి భాగాలను సికెడిలుగా గుర్తించడం లేదు. దీంతో భారత్‌లో సికెడి వ్యాపారం చేస్తున్న కంపెనీలు ఈ అదనపు బెనిఫిట్‌ను కోల్పోయినట్లయింది. ఈ షరతులు కేవలం కార్ల కంపెనీలకే కాకుండా ద్విచక్ర వాహన కంపెనీలకు సైతం వర్తించనున్నాయి.
ఇలా చేయడం వల్ల సదరు కంపెనీలు పూర్తిగా తమ దేశంలో తయారైన వాహనాలను భారత్‌లోకి విడుదల చేసినా.. లేక విడిభాగాలను తెచ్చుకొని భారత్‌లో అసెంబ్లింగ్ చేసినా.. ఎక్సైజ్ సుంకం దాదాపు సమానమయినట్లయింది. దీని వల్ల దేశంలో బిఎమ్‌డబ్ల్యూ అసెంబ్లింగ్ చేస్తున్న ఎక్స్1, 3-సిరీస్, 5-సిరీస్ వంటి మోడళ్లు, అలాగే మెర్సిడెస్ సి-క్లాస్, ఈ-క్లాస్, ఇంకా ఆడి అందిస్తున్న క్యూ5, ఏ4, ఏ6 వంటి లగ్జరీ కార్లపై అదనపు భారాన్ని మోపనున్నాయి. ఫలితంగా వీటి ధరలు మరో ఎనిమిది లక్షల రూపాయల మేర పెరిగే అవకాశం ఉంది. ఈ జాబితాలో టొయోటా ఫార్చ్యూనర్, వోక్స్‌వ్యాగన్ పస్సాట్, ఫోర్డ్ ఎండీవర్‌లు కూడా చేరిపోనున్నాయి.
ఈ అంశంపై భారత ప్రభుత్వం పునఃపరిశీలించాలని సదరు కంపెనీలు భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) ద్వారా కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీని విన్నవించుకున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తమ విక్రయాలు తగ్గిపోవచ్చునని ఆటోమొబైల్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ముఖ్యంగా జర్మనీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో.. జర్మనీ దౌత్య కార్యలయం భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుంది. ఇది గనుక విజయవంతమైతే.. కార్ల ధరలకు రెక్కలు రానట్లే.. మరి విఫలమైతే మాత్రం వినియోగదారుల జేబుకు చిల్లు పడాల్సిందే.


Click it and Unblock the Notifications








