సెకండ్ హ్యాండ్ బైక్‌లపై మక్కువ చూపుతున్న వైజాగ్ వాసులు

విశాఖ నగరంలో సుమారు 100 నుంచి 150 వరకూ ద్విచక్ర వాహన దుకాణాలున్నాయి. ప్రతి ఏటా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. సగటున ప్రతి రోజూ ఒక్కో టూ-వీలర్ షోరూమ్ నుంచి 10 వాహనాల వరకూ అమ్ముడవుతున్నాయి. అయితే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సప్లయ్ లేకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటం, టూ-వీలర్ డెలివరీ సమయం అధికంగా ఉండటం వంటి కొన్ని అంశాలు వినియోగదారులను సెకండ్ హ్యాండ్ వాహనాలపై వైపు దృష్టి సారిస్తున్నాయి. తక్కువ ధరకే మంచి కండిషన్‌లో వాహనాలు లభిస్తుండటంతో బైక్ లవర్స్ సెకండ్ హ్యాండ్ వాహనాలపై మక్కువ చూపుతున్నారు. ఇవి చూడటానికి ఇంచు మించు కొత్త వాటి మాదిరిగానే ఉండటంతో ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలకు డిమాండు ఊపందుకుంది.


Click it and Unblock the Notifications








