ప్రిమీయర్ నుంచి పెట్రోల్ వేరియంట్ రియో ఎస్‌యూవీ

నాలుగు వేరియంట్లలో లభించే ప్రిమీయర్ రియో పెట్రోల్ వెర్షన్ ఎక్స్-షోరూమ్ హైదరాబాద్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
* ప్రిమీయర్ రియో జిఎక్స్ (గ్రే ఇంటీరియర్స్) రూ.4.97 లక్షలు
* ప్రిమీయర్ రియో జిఎల్ఎక్స్ (గ్రే ఇంటీరియర్స్) రూ.5.44 లక్షలు
* ప్రిమీయర్ రియో జిఎక్స్ (బీగీ ఇంటీరియర్స్) రూ.5.31 లక్షలు
* ప్రిమీయర్ రియో జిఎల్ఎక్స్ (బీగీ ఇంటీరియర్స్) రూ.5.87 లక్షలు
ప్రిమీయర్ రియో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది. డీజిల్ వేరియంట్ రియో ఎస్‌యూవీ ధర రూ.5.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ప్రిమీయర్ రియో ఎస్‌యూవీలో పవర్ స్టీరింగ్, ఫోల్డబిల్ రియర్ సీట్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో, 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, రియర్ వైపర్, పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ సైడ్ మిర్రర్స్ మరియు రిమోట్ కంట్రోల్ లాకింగ్ సిస్టమ్ వంటి మరెన్నో ఆకర్షనీయమైన ఫీచర్లు ఉన్నాయి.
ప్రీమియర్ రియోలో 1173సీసీ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు ఇది 75.5 బిహెచ్‌పిల శక్తిని, 103.9 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రిమీయర్ రియో పెట్రోల్ వేరియంట్ ఎస్‌యూవీ లీటరుకు 15 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








