హోండాకు సునామీ దెబ్బ.. బ్రయో విడుదల వాయిదా

వాస్తవానికి కంపెనీ నిర్దేశిత సమయం ప్రకారం భారత మార్కెట్లో బ్రయో కారు సెప్టెంబర్ 2011లో విడుదల కావాల్సి ఉంది. కానీ ఇక్కడ చిన్నకార్లకు ఉన్న డిమాండును దృష్టిలో ఉంచుకొని నిర్దేశిత సమయం కంటే ముందుగానే.. అంటే ఈ నెల 17న తమ కాంపాక్ట్ కారును విడుదల చేయాలని కంపెనీ భావించింది. కానీ.. ఈ హఠాత్పరిణామం వల్ల ఈ విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు హోండా ప్రకటించింది. భారత్‌లోని సియోల్ గ్రూపుతో హోండా మోటార్ జాయింట్ వెంచర్‌గా ఏర్పడి హోండా సియోల్ కార్స్ ఇండియా అనే పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తుంది.


Click it and Unblock the Notifications








