ధరల పెంపుకు సిద్ధమైన ఆటోమొబైల్ కంపెనీలు

ఈ నెలాఖరు నాటికి కానీ లేదా వచ్చే ఆరంభంలో కానీ తమ ఉత్పత్తుల ధరలు పెంచాలని పలు ఆటోమొబైల్ నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా మోటార్ కార్పోరేషన్ సంస్థ భారతీయ అనుబంధ కంపెనీ హోండా సియోల్ కార్స్ ఇండియా (హెచ్ఎస్‌సిఐ) అందిస్తున్న సెడాన్ మోడల్ కారు అకార్డ్ మినహా మిగిలిన అన్నిమోడళ్లపై 2-3 శాతం మేర ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ వివరించింది.
హోండా బాటలోనే ధరలను పెంచేందుకు మరికొన్ని కంపెనీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. గడచిన నెలల్లో విపరీతంగా పెరిగిన ధరల పట్ల కంపెనీ ఆందోళన వ్యక్తం చేస్తుందని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడుఎండీ మైఖేల్ బోన్‌హామ్ తెలిపారు. మార్చి నెలాఖరు నాటికి ధరల పెంపుపై ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. గత వారంలో అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం జనరల్ మోటార్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








