పరుగులు తీస్తున్న అపోలో టైర్ల ధరలు

టైర్ల ధరలను కనీసం 10 శాతం వరకైనా పెంచాల్సిన పరిస్థితి ఉందని, లేదంటే పరిశ్రమ కష్టాల్లో పడగలదని అపోలో టైర్స్ అధిపతి (భారత కార్యకలాపాలు) సతీశ్ శర్మ తెలిపారు. టైర్ల తయారీలో వాడే ముడి సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, ఫలితంగా టైర్ల తయారీకి అయ్యే ఖర్చు కూడా పెరిగుతుందని, అందుకే ఈ భారాన్ని వినియోగదారులపై మోపక తప్పడం లేదని ఆయన వెల్లడించారు. వాణిజ్య వాహనాల టైర్ల ధరలు 3 శాతం వరకూ, ట్రక్కులు, బస్సుల రేడియల్ టైర్ల ధరలు 6 శాతం వరకూ, ప్యాసింజర్ కార్ల టైర్ల ధరలను 3 శాతం వరకూ పెరగనున్నాయని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








